నీరాజనం
ఎన్నికల ప్రచారంలో కారు జెట్ స్పీడ్‌తో దూసుకెళ్తున్నది. గుండెల నిండా గులాబీ జెండా రెపరెపలాడుతున్నది. గ్రామాలు, పట్టణాలను గులాబీ దండు ముంచెత్తుతున్నది. స్వచ్ఛందంగా తరలివస్తున్న జనజాతరతో ప్రచారం హోరెత్తుతున్నది. బీఆర్ఎస్ అభ్యర్థులు నిత్యం ప్రజలతో మమేకమవుతుండడంతో అభిమాన నాయకులకు బ్యాండ్ బాజాలు, బతుకమ్మలతో ఘన స్వాగతం పలుకుతున్నారు.
- ఉమ్మడి జిల్లాలో కారు.. ప్రచార హోరు
- జెట్ స్పీడ్‌తో దూసుకెళ్తున్న బీఆర్ఎస్
- జనజాతరను తలపిస్తున్న పల్లెలు, పట్నాలు
- నిత్యం ప్రజలతో మమేకమవుతున్న మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులు
- ఘన స్వాగతం పలుకుతున్న ప్రజలు
- మార్మోగుతున్న జై కేసీఆర్ నినాదాలు
- సీఎం కేసీఆర్ వెంటే మేమంటూ మద్దతు
ఎన్నికల ప్రచారంలో కారు జెట్ స్పీడ్‌తో దూసుకెళ్తున్నది. గుండెల నిండా గులాబీ జెండా రెపరెపలాడుతున్నది. గ్రామాలు, పట్టణాలను గులాబీ దండు ముంచెత్తుతున్నది. స్వచ్ఛందంగా తరలివస్తున్న జనజాతరతో ప్రచారం హోరెత్తుతున్నది. బీఆర్ఎస్ అభ్యర్థులు నిత్యం ప్రజలతో మమేకమవుతుండడంతో అభిమాన నాయకులకు బ్యాండ్ బాజాలు, బతుకమ్మలతో ఘన స్వాగతం పలుకుతున్నారు. మహిళలు మంగళహారతులతో నీరాజనం పడుతున్నారు. జై కేసీఆర్.. జైజై కేసీఆర్ అన్న నినాదాలు మార్మోగుతున్నాయి. శుక్రవారం ఉమ్మడి జిల్లాలో గులాబీ శ్రేణుల ప్రచారం జోరుగా సాగింది.

వనపర్తిలో వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి, మహబూబ్‌నగర్, హన్వాడ మండలంలో క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ విస్తృతంగా ప్రచారం చేపట్టారు. అలాగే కొత్తకోట మండలంలో ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వ ర్‌రెడ్డి, జడ్చర్లలో ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి, మక్తల్, కృష్ణ మండలాల్లో ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి, దామరగిద్ద మండలంలో ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి, తెలకపల్లి మండలంలో ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి, కడ్తాల మండలంలో ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, మల్దకల్ మండలంలో ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, రాజోళి, వడ్డేపల్లి మండలాల్లో ఎమ్మెల్యే అబ్రహం పాల్గొన్నారు. ప్రజలకు సంక్షేమం, అభివృద్ధిని వివరిస్తూ.. ప్రతిపక్షాల తీరును ఎండగడుతున్నారు.
– నెట్వర్క్ మహబూబ్‌నగర్, నవంబర్ 3

గులాబీ దండు గర్జిస్తున్నది. పార్టీ జెండా రెపరెపలాడుతున్నది. బీఆర్ఎస్ అభ్యర్థులకు ప్రజలు నీరాజనం పడుతున్నారు. గ్రామాలు, పట్టణాలు జన ఉప్పెనతో గులాబీమయంగా మారుతున్నాయి. బ్యాండ్‌మేళాలు, మంగళహారతులు, బతుకమ్మలతో ప్రజలు స్వాగతం పలుకుతున్నారు. జై తెలంగాణ.. జైజై కేసీఆర్ నినాదాలు మార్మోగుతున్నాయి. సీఎం కేసీఆర్ హయాంలో జరిగిన అభివృద్ధిని వివరిస్తూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు.

శుక్రవారం మహబూబ్‌నగర్, హన్వాడ మండలంలో మంత్రి శ్రీనివాస్‌గౌడ్, వనపర్తిలో మంత్రి నిరంజన్‌రెడ్డితోపాటు కొత్తకోట, జడ్చర్ల, దామరగిద్ద, మక్తల్, కృష్ణ, తెలకపల్లి, కడ్తాల, మల్దకల్, రాజోళి, వడ్డేపల్లి మండలాల్లో ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, లక్ష్మారెడ్డి, ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి, చిట్టెం రామ్మోహన్‌రెడ్డి, వెంకటేశ్వర్‌రెడ్డి, మర్రి జనార్దన్‌రెడ్డి, జైపాల్ యాదవ్, బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, అబ్రహం ప్రచారం నిర్వహించారు. ప్రభుత్వ సహకారంతో వారి నియోజకవర్గాల్లో జరిగిన ప్రగతిని వివరించారు. మళ్లీ ఆదరిస్తే మరింత అభివృద్ధి చేసి చూపిస్తామని చెప్పారు. గులాబీ నీడనే ఉంటామని, కేసీఆర్‌ను మళ్లీ సీఎం చేస్తామని ప్రజలు స్వచ్ఛందంగా మద్దతు పలికారు.
– నెట్వర్క్ మహబూబ్‌నగర్,నవంబర్ 3








Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

