వంగూరు, సెప్టెంబర్ 10 : కొండారెడ్డిపల్లిని పూ ర్తి సోలార్ విద్యుత్ గ్రామంగా తీర్చిదిద్దాలని టీజీఎస్పీడీసీఎల్ సీఎండీ ముషరఫ్ అలీ ఫరూఖీ అధికారులను ఆదేశించారు. సోలార్ విద్యుత్ ప్రాజెక్టుగా మండలంలోని కొండారెడ్డిపల్లి గ్రామాన్ని ప్రభు త్వం పైలట్ ప్రాజెక్టుగా ప్రకటించడంతో మంగళవా రం సీఎండీ ఫరూఖీ, కలెక్టర్ సంతోష్ గ్రామానికి వచ్చి సర్వే చేసి అధికారులతో సమీక్ష నిర్వహించా రు.
అంతకుముందు సబ్‌స్టేషన్‌లో కలెక్టర్ సంతోష్‌తో కలిసి సీఎండీ ఫరూఖీ మొక్కలను నాటారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో సీ ఎండీ మాట్లాడుతూ పైలట్ ప్రాజెక్టు ద్వారా సోలార్ విద్యుత్ ప్లాంట్లు నెలకొల్పి గృహ, వాణిజ్య విద్యుత్ అవసరాలతోపాటు రైతులకు ఉచితంగా సోలార్ పంపు సెట్లను అందించాలని ప్రణాళిక రూపొందించామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సోలార్ విద్యుత్‌ను వినియోగించుకునే ప్రయత్నంలో భాగంగా పైలట్ ప్రాజెక్టు కింద కొండారెడ్డిపల్లి, ఖమ్మం జిల్లాలో మ రో గ్రామాన్ని ఎంపిక చేసిందన్నారు.
ఇందులో భా గంగా గ్రామంలో వారంపాటు పర్యటించి ప్రజలు, రైతులు, వ్యాపారుల అభిప్రాయాలను సేకరిస్తారన్నారు. కలెక్టర్ సంతోష్ మాట్లాడుతూ గృహ, రై తుల వ్యవసాయ, వాణిజ్య అవసరాల కోసం సో లార్ను వినియోగించడం ద్వారా విద్యుత్‌ను ఆదా చేయొచ్చన్నారు. అనంతరం గ్రామంలో అభిప్రాయాలను సేకరించారు. కార్యక్రమంలో రెడ్కో ఎం డీ అనీలా, సెర్ప్ డైరెక్టర్ కృష్ణ, అదనపు కలెక్టర్ దేవసహాయం, జేడీ రమేశ్, మాజీ జెడ్పీటీసీ కేవీఎన్‌రెడ్డి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
విద్యుత్ అధికారులతో సమీక్ష
కల్వకుర్తి రూరల్, సెప్టెంబర్ 10 : కల్వకుర్తి తాసీల్దార్ కార్యాలయంలో ట్రాన్స్‌కో సీఎండీ ముషరఫ్‌అలీ ఫరూఖీ, కలెక్టర్ సంతోష్ ట్రాన్స్‌కో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీ ఎండీ మాట్లాడుతూ నిర్ణీత గడువులోగా పైలట్ ప్రా జెక్టును పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నా రు. కార్యక్రమంలో కల్వకుర్తి ఆర్డీవో రాజేశ్‌కుమార్, అధికారులు పాల్గొన్నారు.