మద్దూర్, ఆగస్టు 27 : మండలంలోని నిడ్జింత వేంకటేశ్వరస్వామి ఉత్సవాలు శనివారం ఘనంగా నిర్వహించారు. ఆలయంలో ప్రతి ఏటా శ్రావణమాసం చివరి శనివారం సం దర్భంగా స్వామివారికి జెల్దిబిందె కార్యక్రమం, పల్లకీ సేవ, పూజా కార్యక్రమాలు నిర్వహించారు. జాతరకు పెద్దఎత్తున భక్తులు హాజరై స్వామివారిని దర్శించుకున్నారు. ఖజిపూర్ ఆంజనేయస్వామి వారికి జెల్దిబిందె, పల్లకీ సేవ కార్యక్రమం నిర్వహించారు. పట్టణ కేంద్రంలోని నీలకంఠస్వామి ఆలయంలో అమావాస్య సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అన్నదానం చేపట్టారు.
జెల్దిబిందె మహోత్సవం
మరికల్, ఆగస్టు 27 : మండలంలోని అన్ని గ్రామాల ఆలయాల్లో శ్రావణమాసం చివరి శనివారం సందర్భంగా జెల్దిబిందె కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఆంజనేయస్వామి వారికి పంచామృతాభిషేకం, అలంకరణ, ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. మండలంలోని ఆంజనేయస్వామి ఆలయంలో జెల్దిబిందె మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. భక్తులు భజనలు చేస్తూ వేదపండితుల మంత్రోచ్ఛారణలతో పల్లకీ సేవ కార్యక్రమం నిర్వహించారు. భక్తులు స్వామిని దర్శించుకున్నారు. అనంతరం రెడ్డి సంఘం ఆధ్వర్యంలో అన్నదానం చేపట్టారు. అప్పంపల్లి ఆంజనేయస్వామి జెల్దిబిందె సేవను ఘనంగా నిర్వహించా రు. ఆదివారం స్వామివారి రథోత్సవాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తామని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు.
ముగింపు ఉత్సవాలు
కోస్గి, ఆగస్టు 27 : పట్టణంలోని తిమ్మన్నబావి శివాంజనేయస్వామి ఆలయంలో శ్రావణమాసం ముగింపు ఉత్సవాలు శనివారం అమావాస్య సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ముంగిమళ్ల రామలింగేశ్వరస్వామి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. స్వామివారి ఊరేగింపు కనులపండువగా సాగింది. ఆయా గ్రామాల ప్రజలు, మహిళలు పెద్దఎత్తున హాజరై స్వామి వా రిని దర్శించుకున్నారు.
దామరగిద్ద మండలంలో..
దామరగిద్ద, ఆగస్టు 27 : మండంకేంద్రంతోపాటు కానుకుర్తి, కాయతన్పల్లి గ్రామాల్లో శ్రావణమాసం అమావాస్య సందర్భంగా శనివారం ఆలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కానుకుర్తి బోనమవ్వ ఆలయంలో జెల్దిబిం దె మహోత్సవం ఘనంగా నిర్వహించారు. క్యాతన్‌పల్లి వీరభద్రేశ్వరస్వామి ఆలయం, దామరగిద్ద సంజీవరాయ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదా లు వితరణ, అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో డాక్టర్ వెంకట్రాములు, నాయకులు బాల్‌రెడ్డి, ప్రభాకర్‌గౌడ్, భక్తులు పాల్గొన్నారు.
భక్తులతో కిటకిటలాడిన ఆలయాలు
నారాయణపేట టౌన్, ఆగస్టు 27 : శ్రావణమాసం ము గింపు అమావాస్య సందర్భంగా శనివారం పట్టణంలోని ప లు ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. సుభాష్ నగర్ రోడ్డులోని శనీశ్వరస్వామి ఆలయంలో మూలవిరాట్టు విగ్రహానికి భక్తులు తైలాభిషేకం, నల్లవస్ర్తాల సమర్పణ చేశారు. చౌక్ బజార్లో ఉన్న బాలాజీ మందిర్‌లో అర్చకులు విద్యాధర్ దీక్షిత్, మధుసూదనాచారి మంత్రోచ్ఛారణలతో స్వామి వారి పంచామృతాభిషేకం, తులసి అర్చన, నిర్మాల్యం, మ హామంగళహారతి, తీర్థప్రసాద వితరణ చేశారు. యాద్గీర్ రో డ్డులో ఉన్న అయ్యప్పస్వామి ఆలయంలో అర్చకులు కేదర్నాథ్ స్వామి వారి చందన, భస్మ, కుంకుమ, పంచామృతాభిషేకం, అలంకరణ పంక్తి ్తనిర్వహించారు. ఆలయ కమిటీ నిర్వాహకులు భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశారు. కార్యక్రమాలలో సుధాకర్‌గౌడ్, సైదప్ప, ఉమాపతి, మహిపాల్‌రెడ్డి, భక్తులు పాల్గొన్నారు.
గుండుమాల్ మండలంలో…
గుండుమాల్, ఆగస్టు 27 : మండలంలోని కొమ్మూరు, అంమ్లికుంఠ గ్రామాల్లో శనివారం ఆంజనేయస్వామి ఆలయాల్లో శ్రావణమాసం ముగింపు చివరి శనివారం సందర్భంగా వేడుకలు ఘనంగా నిర్వహించారు. భక్తిశ్రద్ధలతో ఆలయాల్లో భక్తులు భజనలు చేశారు. స్వామివారి ఊరేగిం పు, భజన కీర్తనలు, జెల్దిబిందె మహోత్సవం, తీర్థప్రసాదా లు, అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రామంలో భజన భక్తులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
ఊట్కూర్ మండలంలో…
ఊట్కూర్, ఆగస్టు 27 : శ్రావణమాసం చివరి శనివారం సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయాలను దర్శించుకున్నారు. మండలంలోని పలు ప్రధాన ఆలయాల్లో భక్తులు ఆంజనేయస్వామి, శివకేశవులను దర్శించుకొని అభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీల ఆధ్వర్యంలో భక్తులకు అన్నదానం చేశారు. స్థానిక గోశాల హనుమాన్ ఆలయాన్ని పీఏసీసీఎస్ చైర్మన్ బాల్‌రెడ్డి, సర్పంచ్ సూర్యప్రకాశ్‌రెడ్డి, విండో మాజీ చైర్మన్ నారాయణరెడ్డి, మా జీ జెడ్పీటీసీ అరవింద్‌కుమార్, మాజీ ఎంపీపీ మణెమ్మ దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించారు.
బనదేశ్వర ఆలయంలో…
నారాయణపేట రూరల్, ఆగస్టు 27 : శ్రావణమాసం చివరి అమావాస్యను పురస్కరించుకొని తెలంగాణ-కర్ణాటక సరిహద్దులో ఉన్న కళబెళగుందె క్షేత్రంలో వెలిసిన బనదేశ్వరస్వామి ఆలయంలో శనివారం భక్తులు ప్రత్యేక పూజ లు చేశారు. అర్చకులు స్వామివారికి రుద్రాభిషేకం, బిల్వార్చన, అష్టోత్తర, శతనామావళి, నైవేద్యం, మహామంగళహారతి, సర్వదర్శనం, భక్తులకు తీర్థప్రసాదాలు వితరణ, అన్న దానం చేపట్టారు. మహిళలు, భక్తులు అధికసంఖ్యలో పాల్గొ ని స్వామివారిని దర్శించుకున్నారు. అదేవిధంగా మండలంలోని లోకాయపల్లి లక్ష్మమ్మ ఆలయంలో భక్తులు అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.
మక్తల్ మండలంలో..
మక్తల్, ఆగస్టు 27 : ఆలయాల్లో శ్రావణ శోభ సంతరించుకుంది. పట్టణంలోని ప్రసిద్ధి చెందిన పడమటి ఆంజనేయస్వామి, మల్లికార్జునస్వామి, కన్యకాపరమేశ్వరి, ఉమామహేశ్వరి ఆలయం, కర్ని గుంటిరంగస్వామి ఆలయాల్లో భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చి పూజలు చేశారు. భక్తులకు కర్ణాటకలోని కస్తూర్బాయి, లక్ష్మణ్‌రావు దంపతులు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఆలయాల కమిటీల ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక, ధార్మిక కార్యక్రమాలు నిర్వహించారు. భగవంతుడి నామస్మరణలతో భక్తులు పునీతులయ్యారు.
ప్రత్యేక పూజలు
మక్తల్ అర్బన్, ఆగస్టు 27 : శ్రావణమాసం చివరి అమావాస్య సందర్భంగా పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పట్టణంలోని ఉమామహేశ్వరి ఆలయంలో అ ర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి అభిషేకం, అలంకర ణ, భజన కార్యక్రమాలు, అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ పి.నర్సింహాగౌడ్ దం పతులు శ్రావణమాసం చివరి అమావాస్య సందర్భంగా విజయవాడ కనకదుర్గమ్మను దర్శనం చేసుకొని ప్రత్యేక పూజ లు నిర్వహించారు. లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రతి అమావాస్యకు నిర్వహించే అన్నదాన కార్యక్రమంలో లయన్స్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. కార్యక్రమంలో లయన్స్ క్లబ్ మండ ల అధ్యక్షుడు సూగూర్ జైపాల్‌రెడ్డి, సభ్యులు, ఉమామహేశ్వరి ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
కోయిలకొండ మండలంలో..
కోయిలకొండ, ఆగస్టు 27 : మండలకేంద్రంలోని ఆది ఆంజనేయస్వామి ఆలయంలో శనివారం జల్దిబిందె ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆంజనేయస్వామి ఆలయం నుంచి నృసింహస్వామి ఆలయం వర కు పల్లకీసేవ నిర్వహించి స్వామికి జల్ది ఉత్సవం నిర్వహించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే ఎస్.రాజేందర్‌రెడ్డి పాల్గొని పూజలు చేశారు. మెడికల్ సుదర్శన్ ఆధ్వర్యంలో భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.
వైభవంగా చెన్నకేశవస్వామి జాతర
మూసాపేట, ఆగస్టు 27 : మండలంలోని కొమిరెడ్డిపల్లి గుట్టపై కొలువుదీరిన లక్ష్మీచెన్నకేశవస్వామి జాతర ఉత్సవా లు శనివారం వైభవంగా సాగాయి. ఈ సందర్భంగా స్వామివారికి పల్లకీసేవ నిర్వహించారు. అనంతరం ఉద్దాలను ఊరేగించారు. గ్రామం నుంచి ఎడ్లబండ్లు, ట్రాక్టర్లు, ఆటోలు, కార్లు తదితర వాహనాలతో ఊరేగింపుగా వచ్చి ఆలయం వద్ద ప్రదక్షిణలు చేశారు. అనంతరం ఉట్లు కొట్టే కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
శివాలయంలో..
బాలానగర్, ఆగస్టు 27 : మండలంలోని తిరుమలగిరి నచికేతన్ శివాలయంలో శనివారం ప్రజాప్రతినిధులు ప్రత్యే క పూజలు చేశారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్ర మం నిర్వహించారు. కార్యక్రమంలో సర్పంచులు తిరుపతీనాయక్, మల్లేశ్‌యాదవ్, శంకర్, గోపీనాయక్, రమేశ్‌నాయక్, రమేశ్, రవినాయక్, సింగిల్‌విండో డైరెక్టర్ మంజూనాయక్, టీఆర్ఎస్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ బాలూనాయక్, భాస్కర్‌నాయక్ పాల్గొన్నారు.
రుద్రస్వాహకార మహోత్సవం
జడ్చర్లటౌన్, ఆగస్టు 27 : మున్సిపాలిటీలోని పాతబజా ర్ శివాలయంలో రుద్రస్వాహకార మహోత్సవాన్ని ఘనం గా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో రుద్రాభిషేకం, రుద్రస్వాహకార యజ్ఞం, పూర్ణాహుతి తదితర పూజ లు చేశారు. కార్యకరమంలో ఆలయ ధర్మకర్త భార్గవశర్మ, కిరణ్‌శర్మ, రాధాకృష్ణ, లక్ష్మీవెంకటప్రసన్న, నాగహరిత, రా ము, దీపిక, కృష్ణయ్య పాల్గొన్నారు.
భక్తులకు అన్నదానం
మున్సిపాలిటీలోని శ్రీరాంనగర్‌కాలనీ మైసమ్మ ఆలయంలో భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జెడ్పీ వైస్‌చైర్మన్ యాదయ్య, మున్సిపల్ చై ర్‌పర్సన్ దోరేపల్లి లక్ష్మి అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు శ్రావణీశ్యామ్, చైతన్య, ముడా డైరక్టర్ శ్రీకాంత్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ సూరిశెట్టి పవన్, భాస్కర్, సర్పంచుల సంఘం జిల్లా అధ్యక్షుడు ప్రణీల్‌చందర్, మురళి పాల్గొన్నారు.
భూత్పూర్ మండలంలో..
భూత్పూర్, ఆగస్టు 27 : మండలంలోని మద్దిగట్ల ఆంజనేయస్వామి ఆలయంలో శ్రావణమాసం చివరి శనివారం సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. స్వామివారిని ఎంపీపీ కదిరె శేఖర్‌రెడ్డి దర్శించుకున్నారు. కార్యక్రమంలో సర్పంచ్ ప్రియాంకారెడ్డి, రాంరెడ్డి, నర్సింహారెడ్డి, చెన్నయ్య, బ్రహ్మ య్య తదితరులు పాల్గొన్నారు.
కురుమూర్తి ఆలయానికి పోటెత్తిన భక్తులు
దేవరకద్ర రూరల్, ఆగస్టు 27 : చిన్నచింతకుంట మండ లం అమ్మాపూర్ గ్రామ సమీపంలోని సప్తగిరుల్లో కొలువుదీరిన కురుమూర్తిస్వామి ఆలయానికి శనివారం భక్తులు పోటెత్తారు. శ్రావణమాసం అమావాస్య సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.
సహపంక్తి భోజనాలు
దేవరకద్ర మండలం వెంకటగిరి గ్రామశివారులో కురుమూర్తిస్వామి మొదట పాదం మోపిన పిల్లిగుండ్ల బండపై గ్రామస్తులు ప్రత్యేక పూజలు చేసి సహపంక్తి భోజనాలు చేశారు.