జడ్చర్ల, జనవరి 21: మండలంలోని గంగాపురంలో స్వయంభూగా వెలిసిన లక్ష్మీ చెన్నకేశవస్వామి బ్రహ్మోత్సవాలు ఆదివా రం నుంచి నిర్వహించనునట్లు ఆలయ అధి కారులు తెలిపారు. ఈ నెల 30 వరకు జరిగే బ్రహ్మోత్సవాలకు తెలంగాణ ప్రజలే కాకుం డా ఆంధ్రప్రదేశ్ కర్ణాటక, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల నుంచి భక్తులు అధిక సంఖ్య లో తరలివస్తారని అందుకు తగ్గ ఏర్పాట్లు చేశామని తెలిపారు.
ఆదివారం అలంకారాభిషేకం ఈ సంద ర్భంగా స్వామి, అమ్మవారికి కలశాభిషేకం, సోమవారం అంకురార్పణ, పల్లకీ సేవ విష్వక్సేనపూజ, పుణ్యహవాచనం, అగ్ని ప్రతిష్ట, 24వ తేదీన ధ్వజారోహణం, 25న తిరుకల్యాణం, రాత్రి 6.30గంటలకు స్వామి వారి కల్యాణోత్సవం, 26న శేషవాహన, హంసవాహన సేవలు, 27న రాత్రి 9గంట లకు పుష్పరథం, 28న రథోత్సవం, 29న మధ్యాహ్నం 2 గంటల నుంచి శకటోత్సవం, 30వ తేదీన చక్రతీర్థంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయని వారు తెలిపారు.
గంగాపురం చాళుక్యుల ఉపరాజధానిగా ఉండేదని, ఈ గ్రామాన్ని త్రైలోక్య మల్లకేశవ పురంగా పిలిచేవారని శాసనాల ద్వారా తెలు స్తోంది. క్రీ.శ. 11వ శతాబ్దంలో పశ్చిమ చాళుక్య రాజైన మొదటి త్రైలోక్యమల్ల సోమే శ్వరుడు తన పేరున త్రైలోక్యమల్ల కేశవపు రంలో లక్ష్మీచెన్నకేశవ స్వామి ఆలయాన్ని నిర్మించారని పాల్కురికి సోమనాథుడి పండి తారాధ్య చరిత్రలో వివరించినట్లు తెలుస్తోంది.
చెన్నకేశవాలయం శిల్ప కళలతో చూపరు లను కట్టిపడేస్తుంది. ఆలయం చుట్టూ మట్టి, రాతితో కూడిన ప్రాకారాలు ఉన్నాయి. ప్రధానాలయం చుట్టూ నాలుగు కాలక్షేప మండ పాలు, ఉప ఆలయాలు ఉన్నాయి. ఆలయం ఈశాన్యంలో అతిపెద్ద కోనేరు ఉంది. లక్ష్మీచెన్నకేశవస్వామి బ్రహ్మోత్స వాలు ప్రతి ఏటా మాఘశుద్ధ పాడ్యమి నుం చి నిర్వహిస్తారు. ఈ సందర్భంగా భక్తులు స్వామివారికి దాసంగాలు సమర్పించి మొక్కులు చెల్లించుకుంటారు.
లక్ష్మీచెన్నకేశవస్వామి బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అన్ని ఏర్పాట్లు చేశాం. తాగునీటి సమస్య రాకుండా అవసరం మేరకు ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేస్తాం. జాతరలో పారిశుధ్యం లోపించకుండా తగిన ఏర్పాట్లు చేశాం. భక్తులు రాత్రి బస చేసేందుకు షెడ్లలో తగిన ఏర్పాట్లు చేశాం. దూర ప్రాంతాల నుంచి జాతరకు వచ్చే భక్తుల కోసం కల్వకుర్తి, మహబూబ్‌నగర్‌తో పాటు ఇతర బస్ డిపోల నుంచి ప్రత్యేక బస్సులు నడపనున్నారు.
– శ్రీనివాసరాజు, ఆలయ ఈవో,