ఊట్కూర్, మే 13: గ్రామాల్లో అంతర్గత రోడ్లు సీసీలుగా మారి అద్దంలా మెరుస్తున్నాయి. ఊట్కూర్ మండలంలోని మారుమూల గ్రామాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టిసారించిన ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి స్థానిక ప్రజాప్రతినిధులు అడిగిందే తడువుగా సీసీరోడ్ల నిర్మాణం కోసం పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేయించారు. అంతర్గత రోడ్ల వ్యవస్థ సక్రమంగా లేకపోవడంతో ప్రజల ఇబ్బందులను గుర్తించిన ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులు ఎమ్మె ల్యే సహకారంతో సీసీ రోడ్ల నిర్మాణానికి నిధులు మంజూ రు చేయించుకుని పనులకు శ్రీకారం చుట్టారు. గ్రామాల్లో సీసీరోడ్ల నిర్మాణాలు పూర్తికావడంతో మారుమూల గ్రా మాలు మెరుస్తున్నాయి. సీసీరోడ్ల నిర్మాణాలతో ఇబ్బందులు తొలగినట్లు ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
నిధుల మంజూరు ఇలా..
మండలంలోని నాగిరెడ్డిపల్లిలో అంతర్గత సీసీరోడ్ల నిర్మాణంతోపాటు గ్రామం నుంచి మల్లేపల్లి వరకు ఈజీఎస్ నిధులు రూ.45లక్షలతో పనులు పూర్తి చేశారు. వల్లంపల్లిలో రూ.45లక్షలు, సంస్థాపూర్లో రూ.40లక్షలు, అమీన్పూర్లో రూ.30లక్షలు, పులిమామిడిలో రూ.20లక్షలు, తిప్రాస్‌పల్లిలో రూ.15లక్షలు, ఊట్కూర్‌లో రూ.10లక్షలు, అవుసలోనిపల్లి, బిజ్వారం, చిన్నపొర్ల, ఎడవెల్లి, కొల్లూరు, లక్ష్మీపల్లి, మొగ్దుంపూర్, మల్లేపల్లి, నిడుగుర్తి, ఓబ్లాపూర్, పగిడిమర్రి, పెద్దజట్రం, పెద్దపొర్ల, ఎర్గట్‌పల్లిలో ఒక్కో గ్రామంలో రూ.5లక్షలు ఈజీఎస్ నిధులతో సీసీరోడ్లు నిర్మించారు. వీటితోపాటు 15వ ఆర్థిక సంఘం నిధులతో వార్డుల వారీగా సీసీరోడ్ల నిర్మాణం పనులను పూర్తిచేశారు.
రోడ్డు సౌకర్యం ఏర్పడింది
రోడ్డు సౌకర్యం లేక తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నాం. నిధులు మంజూరు కావడంతో రూ.45లక్షలతో గ్రామం నుంచి మల్లేపల్లి వరకు 2కిలోమీటర్లు సీసీ రోడ్డు వేయిస్తున్నాం. సగం రోడ్డు నిర్మాణం పూర్తయింది. ప్రయాణం సాఫీగా సాగుతుంది. మిగిలిన రోడ్డు పనులను వెంటనే పూర్తి చేయిస్తాం.
గర్వంగా ఉంది
గ్రామంలో అంతర్గత రోడ్ల వ్యవస్థను బాగు చేస్తానని ఎన్నికల్లో ప్రజలకిచ్చిన హామీ నెరవేరింది. అభివృద్ధి విషయంలో ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి పూర్తి సహకారం అందించారు. అన్నివార్డుల్లో సీసీరోడ్లు, సైడ్ కాల్వల నిర్మాణం పూర్తి చేయించినందుకు మహిళా సర్పంచ్‌గా గర్వ పడుతున్నాను.
బురదలోనే నడిచేది
గ్రామంలో రోడ్డు వ్యవస్థ సక్రమంగా లేకపోవడంతో బురద నీటిలో నడుచుకుంటూ వెళ్లే పరిస్థితి ఉండేది. సిమెంటు రోడ్డు వేయడంతో మెయిన్ రోడ్డుపై నడిచేందుకు ఎటువంటి ఇబ్బందిలేదు. ప్రజల ఇబ్బందులను గుర్తించి రోడ్డు వేయించిన ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి, సర్పంచ్‌కు రుణపడి ఉంటాం.