నిధుల వరద
తెలంగాణ ప్రభుత్వం అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తున్నది. ఈ క్రమంలో వివిధ పనుల కోసం నిధుల వరద పారిస్తున్నది. వనపర్తి నియోజకవర్గంలో 38 పనులకు రూ.569 కోట్లు మంజూరయ్యాయి. వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి ముందుచూపుతో నిధులు తీసుకొస్తుండడంతో లక్ష్మీకళ ఉట్టిపడు తున్నది.
- వనపర్తిలో 38 పనులకు రూ.569 కోట్లు
- అభివృద్ధికి సర్కారు ప్రాధాన్యం
- చేరువైన పరిపాలన.. ఉన్నత విద్యకు ఊతం
- మంత్రి నిరంజన్‌రెడ్డి చొరవతో ఫండ్స్
- చెరువుల పునరుద్ధరణకు శ్రీకారం
- మారుతున్న జిల్లా స్వరూపం
తెలంగాణ ప్రభుత్వం అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తున్నది. ఈ క్రమంలో వివిధ పనుల కోసం నిధుల వరద పారిస్తున్నది. వనపర్తి నియోజకవర్గంలో 38 పనులకు రూ.569 కోట్లు మంజూరయ్యాయి. వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి ముందుచూపుతో నిధులు తీసుకొస్తుండడంతో లక్ష్మీకళ ఉట్టిపడు తున్నది. జిల్లా కేంద్రం విశాలమైన రోడ్లతో సుందరంగా మారగా.. డివైడర్లు, సెంట్రల్ లైటింగ్ పట్టణానికి నూతన సొబగులు సంతరించుకున్నాయి. వీటికి తోడు కార్యాలయాలకు నూతన భవనాలు, అన్ని మండలాల్లో షాదీఖాన, పీహెచ్సీ నిర్మాణాలతోపాటు చెరువుల పునరుద్ధరణ చేపట్టడంతో నియోజకవర్గ స్వరూపం పూర్తిగా మారింది. ఇప్పటికే కలెక్టరేట్, ఎస్పీ ఆఫీస్లతోపాటు ఎన్నో ప్రభుత్వ కార్యాలయాలు నిర్మించి ప్రజలకు పరిపాలన చేరువ చేసింది. అలాగే మెడికల్, నర్సింగ్, ఇంజినీరింగ్, వ్యవసాయ, కళాశాలలు ఏర్పాటు చేసి ఉన్నత విద్యకు ఊతమిస్తున్నది.
– వనపర్తి (నమస్తే తెలంగాణ) అక్టోబర్ 19
వనపర్తి, నమస్తే తెలంగాణ, అక్టోబర్ 19 : దశాబ్దాల తరబడి ప్రభుత్వాలు..పాలకులు కొనసాగినా సామాన్య ప్రజలకు అవసరమైన మౌలిక సదుపా యాలను క ల్పించడంలో విఫలమ య్యారు. ఎన్నికలు వచ్చిన ప్పుడల్లా ఏదో ఒకటి…అరపనులను చెప్పి వాటిని కూడా ప్రజల దరికి చేర్చని పరిస్థితులు గతంలో మన కండ్ల ముందున్నాయి. సమైఖ్యపాలనలో తెలంగాణ ప్రాంతనికి అభివృద్ధి పనులకు నిధులు మంజూరు కావాలంటే.. ఎన్ని కుట్రలు.. కుతంత్రాలో తెలియనివి కాదు. ఆ పరిస్థితుల నుంచి తెలంగాణ విముక్తి పొంది దశాబ్దాకాలానికి చేరువవుతుంది. సొంత రాష్ర్టాన్ని సా ధించుకున్న ఈ దశాబ్ద కాలంలోనే అనేక మార్పులను చూస్తున్నాం. కోట్లాది రూపాయలను మంజూరు చేయించుకొని అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్న వైనం అబ్బురపరుస్తున్నది. వనపర్తి నియోజకవర్గం వివాదాలకు దూరం.. విద్యకు దగ్గరగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతం. గత సమైక్య పాలనలో ఇక్కడ అభివృద్ధి అంతంత మాత్రం గానే జరిగింది. ఎన్నో అవకాశాలున్నా..నిధుల మంజూ రుకు నోచుకోలేదు. 60ఏండ్ల్లకు పైగా పాలించిన ప్ర భుత్వాలు ఈ ప్రాంత అభివృద్ధికి నిధులు మంజూరు చేయడంలో అన్యాయం చేశాయి. అయితే, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో ఒక్కసారిగా ఆ పరిస్థితులు మా రిపోయాయి. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తక్కువ సమ యంలోనే ఎక్కువ నిధులు మంజూరు చేసి అభివృద్ధిని పరుగులు పెట్టిస్తుండటం నేటి బీఆర్ఎస్ ప్రభుత్వ పని విధానానికి నిదర్శనంగా నిలుస్తున్నది. ప్రజా సమస్యల పరిష్కారానికి సీఎం కేసీఆర్ ప్రాధాన్యతనివ్వడంతో కోట్లాది రూపాయలతో పనులు పూర్తి చేసుకొని ప్రజల ముంగిట్లోకి చేరుతున్నాయి.
నిధుల వరద
నియోజకవర్గ పరిధిలో దాదాపు 38పనులకు రూ.569 కోట్లను బీఆర్ఎస్ ప్రభుత్వం మంజూరు చేసింది. కొత్త రాష్ట్రంలో భారీగా నిధులు మంజూరు చేసి ముఖ్యమైన పనులను పూర్తి చేయడంతో నియోజకవర్గంలో మార్పు లు వచ్చి కొత్తశోభ సంతరించుకున్నది. గ్రామాల నుంచి పట్టణాలకు వరకు అన్ని రకాల అభివృద్ధి పనులను ఏర్పాటు చేయడంతో ప్రజలకు కనీస అవసరాలు తీరుతున్నాయి. కళాశాలలు, దవాఖానలు, సంక్షేమ భవనాలు, ప్రభుత్వ కార్యాలయాలు అనేకం మం జూరు చేయించుకొని నిర్మాణాలను సహితం పూర్తి చేసి వినియోగంలోకి తీసుకొచ్చారు.
మంత్రి సింగిరెడ్డి ముందు చూపు….
వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ముందు చూపు వల్లే వనపర్తికి అవసరమైన పనులను మంజూరు చేయించారు. ఎమ్మెల్యే అయిన తొలిసారే అనేక ప్రాధాన్యతగల పనులపై దృష్టి సారించారు. వనపర్తికి ఎమ్మెల్యేలుగా అయినవారంతా ఇలా వనపర్తి అభివృద్ధిపై దృష్టి నిలిపితే పరిస్థితి మరోలా ఉండేది. ఇంతకాలం అభివృద్ధికి నోచుకోని ప్రాంతానికి ఇలా ఒక్కసారి వరదలా నిధులను మళ్లించి దీక్ష పనులను చేయించి ప్రజలకు వనరులను సమకూర్చడంలో మంత్రి నిరంజన్‌రెడ్డి సఫలం చెందారు. మంజూరైన పనుల్లో చాలా వరకు పూర్తయ్యాయి. ఇంకా కొన్ని పనులు మాత్రమే చేపట్టాల్సి ఉంది. కొన్ని సాంకేతిక కారణాల వల్ల పనులు పూర్తి కాలేదు. ఇదిలా ఉంటే, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడి పదవిలో కొ నసాగినప్పుడు సహితం సింగిరెడ్డి అనేక పనులను మం జూరు చేయించి అభివృద్ధికి బాటలు వేశారు.
మారుతున్న స్వరూపం
అభివృద్ధి పనుల వేగంతో వనపర్తి నియోజకవర్గ స్వరూ పం మారిపోతుంది.రోడ్ల విస్తరణతో పట్టణమంతా విశాలమైన రోడ్లతో సుందరంగా మారింది. నూతన భవనాలు, సెంట్రల్ లైటింగ్ తళతళ మెరుస్తుంది. ఇక కొత్త కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయాల సమూదాయాలు జిల్లా కేంద్రానికి కొత్త శోభను తెచ్చాయి. కొత్తగా వచ్చిన విద్యా సంస్థలతో విద్యార్థిలోకం సంతోషపడుతున్నది. విద్య, వైద్య రంగాల్లో వనపర్తి నేడు పరుగులు పెడుతున్నది. పేదలకు వైద్యసేవలు అందించడంలోనూ ప్రైవేట్‌కు మించి సర్కారు సేవలు అందుతున్నాయి. తక్కువ సమయంలో ఇలా ఎక్కువ అభివృద్ధి పనులను మం జూరు చేయించుకొని, వాటిని పూర్తి చేసుకోవడం ద్వారా జిల్లా సర్వతోముఖాభివృద్ధికి మార్గం సుగమంగా మారింది.

Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IND vs WI T20I | ఉప్పల్‌లో ఇండియా వర్సెస్ వెస్టిండీస్ టీ20.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా
Gadwal Accident Victims | కేసీఆర్ సార్ బాగున్నారా.. హరీశ్ రావుతో గద్వాల ప్రమాద బాధితులు.. వీడియో
KTRs Meeting | కేటీఆర్ సభకు భారీగా తరలిన బీఆర్ఎస్ శ్రేణులు
Modi Cabinet | రైల్వే ఉద్యోగులకు మోదీ క్యాబినెట్ శుభవార్త.. 78 రోజుల బోనస్ ప్రకటన
మేగ్యతండాలో మహిళా శక్తి భవనం పరిశీలన
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

