భూత్పూర్, ఆగస్టు 27 : రాష్ర్టాన్ని అన్నివిధాలా అభివృద్ధి చేయడమే టీఆర్ఎస్ ప్రభుత్వ ధ్యేయమని దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి అన్నారు. మున్సిపాలిటీలోని మునిరంగస్వామి ఆలయ ఆవరణలో రూ.36లక్షలతో మినీ ఫంక్షన్‌హాల్ నిర్మాణానికి శనివారం శంకుస్థాపన చేశారు. ఆలయ అభివృద్ధి కోసం ఫంక్షన్‌హాల్‌ను మంజూరు చేసినట్లు తెలిపారు. అనంతరం అమిస్తాపూర్‌లో రూ.44లక్షలతో ఉన్ని, చేనేత పారిశ్రామిక భవన నిర్మాణానికి భూమిపూజ చేశారు. అదేవిధంగా మనబస్తీ-మనబడి కార్యక్రమంలో భాగంగా స్థానిక యూపీఎస్ పాఠశాలలో రూ.40లక్షలతో అదనపు తరగతిగదుల నిర్మాణ పనులను ప్రారంభించారు. పాతమొల్గరలో రూ.10లక్షలతో సీసీరోడ్డు నిర్మాణానికి భూమిపూజ చేశారు. అలాగే పాతమొల్గర గ్రామశివారులోని పేపర్‌మిల్లు యజమాని విద్యార్థులకు 24 సైకిళ్లను వితరణ చేయగా, ఎమ్మెల్యే ఆల పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే గ్రామాలు అన్నివిధాలా అభివృద్ధి చెందుతున్నాయన్నారు. గ్రామాల్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. కాగా, కొత్తమొల్గర ఉన్నత, ప్రాథమిక పాఠశాలల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు నర్సింహాగౌడ్ ఎమ్మెల్యేకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ సత్తూర్ బస్వరాజ్‌గౌడ్, ఎంపీపీ కదిరె శేఖర్‌రెడ్డి, జిల్లా మత్స్యసహకార సంఘం ఇన్చార్జి సత్యనారాయణ, మండల ప్రత్యేకాధికారి సాయిబాబా, తాసిల్దార్ చెన్నకిష్టన్న, మున్సిపల్ కమిషనర్ నూరుల్‌నజీబ్, ఎంపీడీవో మున్ని, మున్సిపల్ వైస్‌చైర్మన్ కెంద్యాల శ్రీనివాస్, వైస్‌ఎంపీపీ నరేశ్‌గౌడ్, ముడా డైరెక్టర్లు చంద్రశేఖర్‌గౌడ్, సాయిలు, కౌన్సిలర్లు శ్రీనివాస్‌రెడ్డి, గడ్డం నాగమ్మ, రామకృష్ణ, బాలకోటి, సర్పంచులు సుజాత మ్మ, వెంకటమ్మ, నాయకులు సత్తూర్ నారాయణగౌడ్, ము రళీధర్గౌడ్, అజీజ్, సత్యనారాయణ, అశోక్‌గౌడ్, బోరింగ్ నర్సింహులు, చిన్నా, విజయ్ తదితరులు పాల్గొన్నారు.