అచ్చంపేట : అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణను ( Vamshikrishna ) శనివారం తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ ( Meenakshi Natarajan ), పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్ గౌడ్( Mahesh Kumar Goud ) , తదితరులు పరామర్శించారు. ఎమ్మెల్యే వంశీకృష్ణ గుండెకు సంబంధించి శస్త్ర చికిత్స చేయించుకొని విశ్రాంతి తీసుకుంటుండగా శనివారం ఎమ్మెల్యే నివాసానికి వెళ్లి ఆరోగ్య పరిస్థితి, యోగా క్షేమాలు అడిగి తెలుసుకున్నారు.
వారి వెంట ఏఐసీసీ కార్యదర్శిలు విశ్వనాథ్ , విష్ణు నాథ్, సీడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితులు, ఏఐసీసీ ఇన్చార్జి జనరల్ సెక్రటరీ వంశీచంద్ రెడ్డి, రాష్ట్ర ఎక్సైజ్ పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు,ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి, ఎమ్మెల్యేలు కసిరెడ్డి నారాయణరెడ్డి , కూచుకుల్ల రాజేష్ రెడ్డి ఉన్నారు.