వనపర్తి, జూలై 5 : అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్న తెలంగాణకు ప్రవాసులు చేయూతనివ్వాలని వ్య వసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి తెలిపారు. అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రం టంపాలో బీఆర్ఎస్ యూఎస్ఏ కన్వీనర్ చందు తాళ్ల అధ్యక్షతన బుధవా రం ప్రవాస తెలంగాణ వాసుల ఆత్మీయ సమ్మేళనం ని ర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ గడిచిన తొమ్మిదేండ్లల్లో తెలంగాణ రాష్ట్ర స్వరూపం మొత్తం మారిపోయిందన్నారు. హైదరాబాద్ పేరు అంతర్జాతీయంగా మరింత ఆదరణ చూరగొంటున్నదన్నారు.
ప్రపంచ ప్రసిద్ధి చెందిన పారిశ్రామి క దిగ్గజాలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నాయన్నారు. నిరంతర కరెంట్, సా గు, తాగునీటితో ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామన్నారు. రైతుబంధు, రైతుబీమా, వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్, విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉండడంతో సాగు దశ మారిందన్నా రు. విద్య, వైద్యం, వ్యవసాయం, ఉపాధి కల్పన రంగా ల్లో తెలంగాణ వేగంగా విస్తరిస్తున్నదన్నారు. కేంద్ర ప్రభుత్వం వివిధ రంగాల్లో తెలంగాణకు ఇస్తున్న అవార్డులే ఇందుకు నిదర్శమన్నారు.
ఎదుగుతున్న తెలంగాణకు మట్టిబిడ్డల సహకారం కావాలని కోరారు. అనంతరం హిందూ టెంపుల్ ఆఫ్ ఫ్లోరిడాలో వేద పండితులు మంత్రి నిరంజన్‌రెడ్డిని ఆశీర్వదించారు. కార్యక్రమంలో డాక్టర్ శ్రీనివాస్‌రెడ్డి, కానుగంటి టోనిజాను, మోహిత్ కర్పూరం, తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ ఫ్లోరిడా అధ్యక్షుడు అనిల్ బం దారం, ఉపాధ్యక్షుడు వెంకట్‌రెడ్డి కంచెర్ల, తెలుగు అసోసియేషన్ ఆఫ్ ఫ్లోరిడా అధ్యక్షురాలు మహాతిరెడ్డి, నా ట్స్ చైర్మన్ శ్రీనివాస్ గుత్తికొండ, భానుప్రసాద్ ధూళిపాల, శేఖరం, కొత్త హిందూ టెంపుల్ ఆఫ్ ఫ్లోరిడా అ ధ్యక్షుడు సాయివర్మ, సీతారాంరెడ్డి భవనం, శ్రీకాంత్ జలగం తదితరులు పాల్గొన్నారు.