టార్గెట్బాల్ జాతీయ జట్టు కెప్టెన్‌గా ఉమాశంకర్
కంచిరావుపల్లి యువకుడికి అంతర్జాతీయ గుర్తింపు
పెబ్బేరు రూరల్, జూన్ 8 : భారత జాతీయ టార్గెట్బాల్ కెప్టెన్‌గా వనపర్తి జిల్లా వాసి ఎంపికయ్యాడు. టార్గెట్బాల్ పోటీల్లో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తున్న వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం కంచిరావుపల్లి గ్రామానికి చెందిన యువకుడు ఉమాశంకర్‌కు అరుదైన అవకాశం దక్కింది. జూలై 13 నుంచి 17వ తేదీ వరకు బంగ్లాదేశ్‌లోని ఢాకాలో జరగబోయే అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనే మన జట్టుకు ఉమాశంకర్ నాయకత్వం వహించనున్నారు.
తెలంగాణ టార్గెట్బాల్ అసోసియేషన్ కార్యదర్శి రేవంత్‌కుమార్ బుధవారం ‘నమస్తే తెలంగాణ’కు తెలిపారు. గ్రామ వాసికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు రావడంపై స్థానికులు, కోచ్ కమలాకర్, ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా టార్గెట్బాల్ అసోసియేషన్ బాధ్యులు నర్సింహ, వెంకటేశ్ హర్షం వ్యక్తం చేశారు.