మహబూబ్‌నగర్ కలెక్టరేట్, సెప్టెంబర్ 28: అశాస్త్రీయమైన సర్దుబాటు జీవో 25ను సవరించడంతోపాటు ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణ ఉత్తర్వులను వెంటనే నిలిపివేయాలని ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ నాయకులు డిమాండ్ చేశారు. శనివారం పాలమూరు కలెక్టరేట్ ఎదుట యూఎస్పీసీ ఆధ్వర్యంలో ఆందోళన, నిరసన కార్యక్రమాలు చేపట్టారు. అనంతరం కలెక్టర్ విజయేందిర బోయికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడారు.
బదిలీ ఉపాధ్యాయులను వెంటనే రిలీవ్ చేయాలన్నారు. జీవో 25ను సవరించిన తర్వాతే ఉపాధ్యాయులను సర్దుబాటు చేయాలని డిమాండ్ చేశారు. తెలుగు, ఆంగ్ల మాధ్యమాలు ఉన్న పాఠశాలల్లో ప్రతి సబ్జెక్టుకు ఉపాధ్యాయులు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉండాలన్నారు. కార్యక్రమాల్లో నాయకులు వెంకటేశ్, రవికుమార్, ఆదిత్య, వెంకటేశ్వర్లు, మహమూద్, నారాయణమ్మ, శ్రీశైలం, ఉమాదేవి, కనక మ్మ, శంకర్, ఖాదరయ్య, విజయలక్ష్మి, శివరాజ్, నరేశ్, అజయ్, సంధ్యారాణి, కు ర్మయ్య, మద్దిలేటి, వా మన్కుమార్ ఉన్నారు.
గద్వాల, సెప్టెంబర్ 28: ఎస్సీ గురుకుల పాఠశాల, కళాశాలల్లో విధులు నిర్వహిస్తున్న పార్ట్‌టైమ్ సిబ్బందికి పెండింగ్‌లో ఉన్న తమకు నాలుగు నెలలుగా వెంటనే విడుదల చేయాలని గురుకుల పాఠశాల ఎదుట భోజన విరామ సమయంలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. ఈ విద్యాసంవత్సరం జూన్‌లో ప్రారంభం కాగా ఇప్పటి వరకు తమకు వేతనాలు విడుదల కాలేదని ఆవేదన వ్యక్త ంచేశారు.
కనీసం పండుగలకైనా జీతాలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. వేతనాలు రాకపోవడంతో కుటుం బ పోషణ కష్టతరంగా మారిందన్నారు. కనీసం తమ పిల్లలకు ఫీజులు కట్టలేని పరిస్థితి నెల కొందన్నారు. వెంటనే జీతాలు విడుదల చేసి తమ ఇబ్బందులను తొలగించాలని కోరారు. నిరసన కార్యక్రమంలో నాగరాజు, మసూద్, దేవప్ప, మునిస్వామి, వెంకటేశ్, నరేశ్, ఆనందం, దేవన్న, తదితరులు పాల్గొన్నారు.