కొత్తకోట, మార్చి 4 : ప్రతిఒక్కరూ న్యాయ చట్టాలను తెలుసుకోవాలని ఆ త్మకూరు జూనియర్ సివిల్ జడ్జి శిరీష సూచించారు. పుట్టుకతో ఎవరూ నేరస్తు లు కారని, క్షణికావేశంతో సమాజంలో చట్టాలపై అవగాహన లేని వారు చిన్నచిన్న తప్పులు చేసి నేరుస్తులుగా మారుతారని చెప్పారు. శనివారం పట్టణంలో ని మున్సిపల్ కార్యాలయంలో ఉచిత న్యాయ సేవలకు సంబంధించి అవగాహన సదస్సుకు జడ్జి హాజరై మాట్లాడా రు. దారిద్య్రరేఖ దిగువన ఉన్న పేదలకు ఉచిత న్యాయ సేవలు అందించేందుకు పట్టణంలో కేంద్రాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు.
ప్రతి శనివారం ఫిర్యాదులు స్వీకరించేందుకు కానాయపల్లి గ్రామానికి చెందిన యువ న్యాయవాది శంకర్సాగర్ను లీగల్హెడ్ బ్యానల్ అ డ్వకేట్గా నియమించినట్లు చెప్పారు. అనంతరం సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలను ఆకస్మికంగా త నిఖీ చేశారు. సమస్యల గురించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. రుచికరమైన భోజనం, పరిశుభ్రమైన వసతి క ల్పించాలని ప్రిన్సిపాల్ మాలతికి సూ చించారు. ఇండియా బుక్ ఆఫ్ రికార్డు లో స్థానం సంపాదించిన 8వ తరగతి విద్యార్థిని శిరీషను సత్కరించి మెమోం టో అందజేశారు. ఆమె వెంట సీనియర్ న్యాయవాది మోహన్‌కుమార్, వెంకటరమణ, శివన్న, రాములు యాదవ్, త రుణ్ నాయక్, మునగారి కృష్ణ, మున్సిపల్ చైర్పర్సన్ సుకేశిని, కమిషనర్ వెంకటేశ్వర్లు, మాజీ జెడ్పీటీసీ విశ్వేశ్వర్, ఉపాధ్యక్షుడు యాదగిరి పాల్గొన్నారు.
మదనాపురం గురుకుల తనిఖీ
మదనాపురం, మార్చి 4 : మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాలను న్యాయవాది కృ ష్ణతో కలిసి జడ్జి శిరీష తనిఖీ చేశారు. రికార్డులు, విద్యార్థుల భోజనం మెనూ ను పరిశీలించారు. వంటగది, భోజనశా ల, హాస్టల్ గదులు అపరిశుభ్రంగా ఉ న్నాయని ప్రిన్సిపాల్ రవీందర్‌పై ఆగ్ర హం వ్యక్తం చేశారు. ఆమె వెంట ఎస్సై మంజునాథ్‌రెడ్డి ఉన్నారు.