దేవరకద్ర, ఏప్రిల్ 25 : రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేని ప్రతిపక్షాలు అసత్య ఆరోపణలు చేస్తున్నారని, వాటిని ప్రజలు పట్టించుకోవద్దని దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి పిలుపునిచ్చారు. దేవరకద్ర పట్టణంలో మంగళవారం నియోజకవర్గ స్థాయి బీఆర్ఎస్ ప్రతినిధుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆల మాట్లాడుతూ కేంద్రం జాతీయ స్థాయి అవార్డులు ప్రకటించగా.. దేశం మొత్తం 48 అవార్డులు వస్తే అందులో తెలంగాణకే 13 వచ్చాయన్నారు. దీ న్ని బట్టి రాష్ట్రంలో ఎంత అభివృద్ధి జరిగిందో ఊ హించుకోవచ్చన్నారు. ఇన్ని రోజులు ప్రజలను ప ట్టించుకోని నాయకులు.. నేడు ఎన్నికలు సమీపిస్తుండడంతో గ్రామాల్లోకి వచ్చి ఇష్టారీతిగా మోసం చేసేందుకు యత్నిస్తున్నారన్నారు. అలాంటివారితో జాగ్రత్తగా ఉండాలన్నారు. కరివెన రిజర్వాయర్ పూ ర్తయితే నియోజకవర్గంలో ఎక్కడా బీడు భూములు కనిపించవని, ఈ ప్రాజెక్టును అడ్డుకునేందుకు కాం గ్రెస్ నాయకులు కోర్టులో కేసులు వేశారని మండిపడ్డారు.
కర్ణాటక, ఏపీలోని ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇచ్చి.. తెలంగాణలోని వాటికి ఎందుకు ఇ వ్వడం లేదని అడిగే దుమ్మ బీజేపీ ఎమ్మెల్యేలకు లేదన్నారు. ఇప్పటికైనా ధైర్యం ఉంటే ప్రధాని ఇంటి ఎదుట ధర్నా చేసి జాతీయ హోదా తీసుకురావాలన్నారు. నియోజకవర్గంలో తొమ్మిది ఆనకట్టల ఏ ర్పాటుకు ప్రభుత్వం రూ.77.69 కోట్లను మంజూ రు చేసిందన్నారు. ఈడీ, సీబీఐ సంస్థలను ఉసిగొ ల్పి ప్రభుత్వాలను బెదిరించాలని కేంద్రం యత్నిస్తున్నదని, సీఎం కేసీఆర్ అలాంటి వాటికి జంకే వ్యక్తి కాదన్నారు. జెడ్పీ చైర్పర్సన్ స్వర్ణసుధాకర్‌రెడ్డి మా ట్లాడుతూ నియోజకవర్గంలోని ప్రతి కార్యకర్తకూ బీ ఆర్ఎస్ ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో దేశంలో పెనుమార్పులు చోటు చేసుకోవడం ఖాయమన్నారు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో వస్తే తమ సమస్యలు పరిష్కారమవుతాయని ప్రజలు భావిస్తున్నారన్నారు. దేశంలో, రాష్ట్రంలో బీఆర్ఎస్ సర్కార్ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. అంతకుముందు బీ ఆర్ఎస్ జెండాను ఆవిష్కరించారు. 13 అంశాలపై తీర్మానాలు చేసి రాష్ట్ర అధ్యక్షులకు పంపించారు. కార్యక్రమంలో ఎంపీపీలు రమ, మౌనిక, హర్షవర్ధన్‌రెడ్డి, శేఖర్‌రెడ్డి, పార్టీ మండలాధ్యక్షులు నరసింహారెడ్డి, రాములు, భూత్పూర్ మున్సిపల్ చైర్మన్ బస్వరాజ్‌గౌడ్, ముడా డైరెక్టర్ రాజు, మహెమూద్, మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ, జెడ్పీటీసీలు, సర్పంచులు, ఎంపీటీసీలు, కార్యకర్తలు ఉన్నారు.