తిమ్మాజిపేట : వేసవిలో సమయాన్ని వృథా చేసుకోకుండా శిక్షణ ద్వారా విద్యార్థులు భవిష్యత్లో రాణించ వచ్చనే సంకల్పంతో ప్రభుత్వం వేసవి శిక్షణ తరగతులను ( Summer training classes ) నిర్వహిస్తుందని తిమ్మాజీపేట మండల విద్యాశాఖాధికారి సత్యనారాయణ శెట్టి ( MEO Satyanarayana Shetty ) తెలిపారు. మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సోమవారం వేసవి శిక్షణ తరగతులను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 15 రోజులపాటు నిర్వహిస్తున్న శిబిరంలో ఆరు నుంచి తొమ్మిదో తరగతి లోపు విద్యార్థులకు వివిధ రకాల స్కిల్స్ నేర్పిస్తున్నామని వివరించారు. మొదటిరోజు35 మంది బాలబాలికలకు డ్రాయింగ్, కుట్లు అల్లికలు, వివిధ రకాల ఇండోర్ గేమ్స్ పై శిక్షణ ఇస్తున్నామని వెల్లడించారు. శిక్షణకు విద్యార్థులను పాఠశాలకు పంపించాలని తల్లిదండ్రులకు సూచించారు. విద్యార్థులు శిక్షణను పూర్తిస్థాయిలో నేర్చుకుని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.