వనపర్తి, డిసెంబర్ 29 (నమస్తే తెలంగాణ): నేరాల నియంత్రణలో జిల్లా పోలీస్ యంత్రాంగం విజయం సాధించారని ఎస్పీ అపూర్వరావు అభిప్రాయపడ్డారు. ఎస్పీ కార్యాలయంలో గురువారం ఏర్పా టు చేసిన మీడియా సమావేశంలో జిల్లాలో ని నేరాలకు సంబంధించిన వార్షిక నివేదిక ను ఆమె వెల్లడించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గతేడాదితో పోల్చితే ప్రస్తుత ఏడాదిలో నేరాల సంఖ్య గణనీయంగా త గ్గిందన్నారు. హత్యలు, దోపిడీలు, దొంగతనాలు, మహిళలపై దాడులు, చైన్‌స్నాచింగ్‌ల నియంత్రణలో జిల్లా పోలీసులు ముం దువరుసలో ఉన్నారని కొనియాడారు. రో డ్డు ప్రమాదాలకు సంబంధించి పోలీసులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడంతో గతేడాదితో పోలీస్తే ఈ ఏడాదిలో ప్రమాదాలు గణనీయంగా తగ్గాయన్నారు. 2020 ఏడాదిలో 2,346 కేసులు నమోదు కాగా, 2021లో 2,086 కేసులు నమోదయ్యాయని, ప్రస్తుత ఏడాదిలో 1,707 కేసులు మాత్రమే నమోదయ్యాయని అన్నారు. క్రమేపీ నేరాల సంఖ్య తగ్గుముఖం పడుతున్నదని చెప్పారు.
చోరీల నగదు,రోడ్డు ప్రమాదాల నియంత్రణలో భేష్
జిల్లాలో రోడ్డు ప్రమాదాలు గత ఏడాదితో పోలిస్తే 2022లో తగ్గాయని ఎస్పీ అపూర్వరావు తెలిపారు. గతేడాది రోడ్డు ప్రమాదా లు 246 అందులో మరణాలు 146 కాగా, క్షతగాత్రులు 327 ఉన్నాయి. ఈ ఏడాది ప్రమాదాల సంఖ్య 179కాగా మరణాలు 107, క్షతగాత్రులు 159 మాత్రమే వాటిల్లాయి. 2020లో రోడ్డు ప్రమాదాలు 252, మరణాలు 134, క్షతగాత్రుల 322 నమోదయ్యాయి. దొంగతనాల శాతం వారీగా చూస్తే 2020లో 78 శాతం, 2021లో 81 శాతం, 2022లో కేవలం 36 శాతం మా త్రమే దొంగతనాలు జరిగినట్లు ఎస్పీ వెల్లడించారు. సైబర్ నేరాల కేసులు ప్రతి ఏటా పెరుగుతూ పోతున్నాయి. గడిచిన మూడేండ్ల్లలో 2020లో 5 కేసులు, 2021లో 27 కేసులు, 2022లో 35 కేసులు నమోదయ్యాయి. వీటి పట్ల ప్రత్యేక దృష్టి సారిస్తామని ఎస్పీ స్పష్టం చేశారు.
హత్యలు, లైంగిక దాడులు తగ్గుముఖం
హత్యలు, లైంగిక దాడి కేసులు 11 నమోదయ్యాయని ఎస్పీ అపూర్వారావు వెల్లడించారు. ఆత్మహత్యలు గడిచిన రెండేళ్లతో పో లీస్తే ఈ ఏడాది 86 కేసులు నమోదయ్యా యి. 36 లైంగిక దాడుల కేసులు నమోదయ్యాయి. పేకాట కేసుల్లో కూడా మరింత తగ్గి 19 కేసులు మాత్రమే నమోదయ్యా యి. పట్టుబడిన నిందితుల నుంచి డబ్బుల వసూలూ చేసే విషయంలో గడిచిన రెండేళ్లలో పోలీస్తే రూ.3,14,540 మాత్రమే వసూళ్లు చేసి వెనుకంజలో ఉన్నారు. రేషన్ బియ్యాన్ని కట్టడి చేయడానికి అధిక కేసులు నమోదు చేశారు. గడిచిన రెండేళ్లతో పోలీస్తే ఈ ఏడాది 43 కేసులు నమోదు చేసి 1624.1 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని స్వా ధీనం చేసుకున్నారు.
క్రికెట్ బెట్టింగ్ విషయంలో అసలు కేసులు నమోదు కాకపోవ డం గమనార్హం. బైక్ దొంగతనాలలో మా త్రం గడిచిన మూడేళ్లలో యథావిధిగా 15 కేసులు నమోదవుతున్నాయి. డ్రంకెన్ డ్రైవ్ లో రూ.8,28,800 జరిమానా విధించి 102 మందికి జైలుశిక్ష వేయించినట్లు ఆమె వెల్లడించారు.. ప్రజావాణి ఫిర్యాదులు స త్వర పరిష్కారం చేసి నమోదైన 549 కేసు ల్లో 335 పరిష్కారం కాగా 214 పరిష్కార దశలో ఉన్నాయి. నమోదైన వాటిలో అత్యధికంగా భూ ఫిర్యాదులు 218 ఉన్నట్లు వెల్లడించారు. డయల్ 100 కాల్స్ ద్వారా 2022లో 9,153 కాల్స్‌ను పోలీసులు ఛే దించారు. వనపర్తి జిల్లాలో 12 పోలీస్ స్టేషన్ల్లో నేస్తం కార్యక్రమంలో భాగంగా 810 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. అందు లో 13 స్పీడ్ లేజర్ గన్ కేసులతో పాటు రూ.24,49,995 జరిమానా వేసూ 23, 677 కేసులు నమోదు చేశారు.
ఈ చలాన్ల లో మొత్తం 92,652 కేసులు నమోదు కాగా జరిమానాగా రూ.43లక్షల20వేలను విధించారు. ఇసుక అక్రమ రవాణాలో 73 కేసులు నమోదు చేసి 113 మందిని అరెస్ట్ చేశారు. జిల్లాలో ఈవ్ పిటీ కేసులు 2030 నమోదయ్యాయి. ప్రజాహితంలో మేము సైతం అంటూ రెండు మెగా మెడికల్ క్యాం పులు నిర్వహించి ఉత్తమ అవార్డులు పొం దారు. జిల్లాలో మొత్తం కమ్యూనిటీ పోలీసింగ్‌లో భాగంగా 500మంది అభ్యర్థులు దేహదారుఢ్య పరీక్షలు, ఉచిత పరీక్షలకు శిక్షణలు ఇప్పించినట్లు తెలిపారు. సమావేశం లో సీఐలు శ్రీనివాస్‌రెడ్డి, ప్రవీణ్‌కుమార్, రత్నం, శ్రీనివాసాచారి, ఎస్సై పాల్గొన్నారు.