ఊట్కూర్, జనవరి 7 : మండలంలో ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో శనివారం 8, 9వ తరగతి విద్యార్థులకు మండలస్థాయిలో ఇంగ్లిష్ స్పెల్ విజర్డ్, స్టోరీ టెల్లింగ్ ప్రతిభ పరీక్షలు నిర్వహించారు. స్పెల్లింగ్ పరీక్షలో కేజీబీవీ 9వ తరగతి విద్యార్థులు స్పందన ప్రథమ, శిరీష ద్వితీయ స్థానం, స్టోరీ టెల్లింగ్‌లో ఊట్కూర్ జెడ్పీ ఉన్నత పాఠశాల 9వ తరగతి విద్యార్థులు జె.అభిషేక్ ప్రథమ, డి.అఖిల్‌కుమార్ ద్వితీయ స్థానంలో నిలిచి ఈనెల 22న జరిగే జిల్లాస్థాయి ప్రతిభ పోటీల్లో పాల్గొంటారని ఆంగ్లభాష ఉపాధ్యాయుడు వెంకట్రాము లు తెలిపారు. విద్యార్థులను ఎంఈవో వెంకట య్య, ప్రధానోపాధ్యాయులు సురేశ్, స్పందన అభినందించి విద్యార్థులకు ప్రశంసాపత్రాలను అందజేశారు.
మండలస్థాయి ఈఎల్టీఏ పోటీలు
కృష్ణ, జనవరి 7 : మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శనివారం మండలస్థాయి ఈఎల్టీఏ స్టోరీ టెల్లింగ్, స్పెల్ వైజర్డ్ పోటీలు క్లస్టర్ హెచ్ఎం నిజాముద్దీన్, పలు పాఠశాలల ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో విజయవంతంగా నిర్వహించారు. మండలస్థాయి పోటీల్లో 8, 9వ తరగతి విద్యార్థులకు ప్రతిభ పరీక్షలు నిర్వహిస్తే ప్రతిభను చాటుకున్నారు. ప్రతిభ కనబర్చిన విద్యార్థులను అభినందించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.