అయిజ, నవంబర్ 4 : ఆర్టీసీ బస్సులు నిలపడంలేదని విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. ఆర్టీసీ బస్సులు నిలపకపోవడంతో సమయానికి పాఠశాలలు, కళాశాలలకు సమయానికి చేరుకోలేక విద్యాబోధన కోల్పోతున్నామని విద్యార్థులు మండిపడ్డారు. మంగళవారం అయిజ మున్సిపాలిటీ పరిధిలోని పర్దిపురం గ్రామంలోని అయిజ-కర్నూల్ అంతర్రాష్ట్ర రోడ్డుపై విద్యార్థులు, తల్లిదండ్రులు బైఠాయించారు.
ఉదయం 8గంటల నుంచి పర్దిపురం గ్రామంలో నిలిచినా కర్నూల్ వైపు నుంచి వచ్చే బస్సులు డ్రైవర్లు, కండక్టర్లు నిలపకుండా పోతున్నారని వాపోయారు. బస్సులు ఖాళీగానే వెళ్తున్నా పట్టించుకోకుండా వెళ్తుండడంతో పాఠశాల లు, కళాశాలలకు వెళ్లలేకపోతున్నామని వి ద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలో స్టాప్ ఉన్న విషయమే డ్రైవర్లు, కండక్టర్లు మ ర్చిపోయారని పేర్కొన్నారు. బస్సులు నిలుపని విషయం డీఎం, ఆర్టీసీ అధికారులకు పలుమార్లు విన్నవించుకున్నా ఫలితం లేకపోవడంతోనే రోడ్డుపై బైఠాయించామని తెలిపారు.
పాఠశాలలు, కళాశాలల సమయాలకు ప్రత్యేకంగా విద్యార్థుల కోసం బస్సులను ఏర్పాటు ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోవడం లేదని, శాంతినగర్, జూలెకల్, వెంకటాపూర్, పర్దిపురం వరకు ప్రత్యేకంగా బస్సులు నడపాలని డిమాండ్ చేశారు. దాదా పు రెండు గంటల పాటు అంతర్రాష్ట్ర రోడ్డుపై ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోవడంతో ప్రయాణికులు, వాహనదారులు ఇబ్బందు లు పడ్డారు. విషయం తెలుసుకున్న అయిజ ఎస్సై శ్రీనివాసరావు, ట్రైనీ ఎస్సై తరుణ్కుమార్రెడ్డి పర్దిపురంకు చేరుకొని విద్యార్థులు వారి తల్లిదండ్రులకు నచ్చచెప్పారు. ఆర్టీసీ డీఎంతో ఎస్సై బస్సులు నిలిపేలా చర్యలు తీసుకోవాలని కోరారు.