మహబూబ్‌నగర్ కలెక్టరేట్ : విద్యార్థులు కష్టపడి ఉన్నత స్థానానికి ఎదగాలని పాలమూరు యూనివర్సిటీ ( Palamuru University ) అకాడమిక్ ఆడిట్ సెల్ డైరెక్టర్ డాక్టర్ చంద్రకిరణ్ (Dr. Chandrakiran) అన్నారు. యూనివర్సిటీ పీజీ కాలేజీలో ఆదివారం సెమినార్ హాల్లో ఇంటిగ్రేటెడ్ కెమిస్ట్రీ చివరి సంవత్సరం విద్యార్థులకు నాలుగవ సంవత్సరం విద్యార్థులు వీడ్కోలు ఏర్పాటు చేశారు.
ఈ వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కెమిస్ట్రీ పూర్తి చేసిన విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని, రీసెర్చ్‌ను కెరీర్‌గా ఎంచుకోవాలని, అందరికంటే భిన్నంగా ఆలోచించి, జీవితంలో ఉన్నత స్థానానికి ఎదగాలని సూచించారు. గొప్ప శాస్త్రవేత్తలుగా సమాజానికి సేవ చేయాలని , బలమే నీకు ఆయుధమని పేర్కొన్నారు. కార్యక్రమంలో విభాగాధిపతి డాక్టర్ రవికుమార్, రామ్మోహన్ ,శ్రీధర్ రెడ్డి , సిద్దరామ గౌడ్ ,రామరాజు , ఫార్మసీ కాలేజీ ప్రిన్సిపాల్ రవికాంత్ , విద్యార్థులు పాల్గొన్నారు.