ఆత్మకూరు, అక్టోబర్ 28 : పెండింగ్‌లో ఉన్న రూ.7,500కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్, ఉపకారవేతనాలను వెంటనే విడుదల చేయాలని ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సాయికుమార్, జిల్లా కన్వీనర్ అర్జున్ డిమాండ్ చేశారు. ఏబీవీపీ ఆధ్వర్యంలో ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలల విద్యార్థులతో సోమవారం ఆత్మకూరులోని గాంధీచౌక్‌లో బైఠాయించి రాస్తారోకో చేపట్టారు.
ఎన్నికలకు ముందు ఒకే విడుతలో రీయింబర్స్మెంట్ ఇస్తానన్న సీఎం రేవంత్‌రెడ్డి ఇప్పుడెందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు. విద్యార్థుల భవితకు ఆటంకం కలగకుండా వెంటనే పెండింగ్ ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్స్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. దాదాపు గంటపాటు రాస్తారోకో చేపట్టడంతో వాహనాలు భారీగా నిలిచిపోయాయి. అనంతరం పోలీసులు విద్యార్థులతో మాట్లాడి విరమింపజేశారు. కార్యక్రమంలో నాయకులు రాజేశ్, నిజగుణ, సందీప్, అనిల్, మాణి తదితరులు పాల్గొన్నారు.