నారాయణపేట, ఆగస్టు 11 : తెలంగాణ తొలి ప్రభుత్వంలో పదేండ్లు పకడ్బందీగా సాగిన గురుకుల పాఠశాలల నిర్వహణ కాంగ్రెస్ సర్కారులో అనేక సమస్యల తో సతమతమవుతున్నాయి. నారాయణపేట జిల్లాలో ని పలు గురుకులాల్లో కనీస వసతులు లేక విద్యార్థులు ఇబ్బందులకు గురవుతున్నారు. కనీసం తాగునీరు కూ డా లేని పరిస్థితి నెలకొన్నది. సరిపడా గదులు లేక చ దువు ఒకేచోట, పడుకునేది కూడా ఒకేచోట కొనసాగుతున్నది. ధన్వాడ ఎస్టీ గురుకులంలో తాగునీళ్లు కూడా లేవు. పాఠశాల, జూనియర్ కళాశాలతో కలిపి మొత్తం 650 మంది విద్యార్థులున్నారు. మరుగుదొడ్లు ఉన్నా ని ర్వహణ లేక నిరుపయోగంగా మారాయి. దీంతో కాలకృత్యాల కోసం విద్యార్థులు గురుకుల సమీపంలోని చె ట్లపొదల్లోకి వెళ్లాల్సి దుస్థితి నెలకొన్నది.
డ్రెస్‌తోపాటు కాస్మొటిక్ ఇవ్వడం లేదు. గురుకుల పరిసరాల్లో చిరుతపులి సంచరిస్తున్నట్లు వదంతులు వినిపిస్తున్నాయి. ప్ర హరీ ఉన్నా గేటు లేకపోవడంతో భయాందోళనకు గురవుతున్నారు. కృష్ణ మండలంలోని హిందూపూర్ కస్తుర్బాగాంధీలో ఇది వరకున్న భవనంలో 6 నుంచి 10వ తరగతి వరకు కొనసాగేది. ఇటీవల ఇంటర్మీడియట్ స్థాయికి పెంచడంతో 50మంది విద్యార్థులు అదనంగా చేరారు. కానీ అదే పాత భవనంలో పాఠశాల, కళాశాల నిర్వహిస్తుండడంతో ఇరుకు గదులతో ఇబ్బందులు ప డుతున్నారు.
మాగనూర్ మండలంలోని నల్లగట్టు మా రెమ్మ ఆలయం సమీపంలోని గురుకులానికి ప్రహరీ లే దు. సమీపంలోనే మద్యం దుకాణం ఉండడంతో విద్యార్థులు భయాందోళనకు గురవుతున్నారు. నారాయణపేట సమీపంలోని ఎర్రగుట్ట గురుకులానికి ప్రహరీ ఒక వైపు కూలిపోవడంతో కుకలు గురుకులంలోకి వచ్చి కరుస్తున్నాయని వాపోతున్నారు. మద్దూరు ఎస్సీ బాలికల గురుకులానికి సొంత భవనం లేదు. దామరగిద్ద గురుకులంలో ఇంటర్మీడియట్ స్థాయికి పెంచడంతో ఇరుకు గదులతో ఇబ్బందులు పడుతున్నారు.
మక్తల్ గురుకులలో 400 విద్యార్థులకు ఇరుకు గదుల కారణంగా తరగతులు నిర్వహించిన గదుల్లోనే పడుకోవాల్సిన దుస్థితి నెలకొన్నది. నర్వలో బాలికలకు సరైన వసతులు లేక తీవ్ర ఇబ్బందులు ఎదురొంటున్నారు. ఎస్సీ బాలికల గురుకులాన్ని సంగంబండ రిజర్వాయర్ క్వార్టర్స్‌లో ఏర్పాటు చేయగా, సరిపడా గదులు లేవు. మైనార్టీ బాలికల గురుకుల పాఠశాలలోనూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఊట్కూరు గురుకులంలో డార్మిటరీ లేదు. కోస్గి మండలం నాచారంలోని గురుకులంలో తాగునీరు లేక కలుషిత నీటిని తాగి అస్వస్థతకు గురవుతున్నారు. అలాగే ఇటీవల పురుగుల అన్నం కారణంగా విద్యార్థులు రోడ్డెక్కి నిరసన తెలిపారు.