మహబూబ్నగర్ విద్యావిభాగం, సెప్టెంబర్ 14: వ్యాధుల కాలం.. పరిసరాల పరిశుభ్రతే ప్రధానం అంటున్న ప్ర భుత్వం.. సర్కారు బడులను మాత్రం పట్టించుకోవడం లే దు. దీంతో పారిశుధ్యం పడకేసింది. మరుగుదొడ్లు, మూత్రశాలలను శుభ్రం చేసే సిబ్బంది లేకపోవడంతో పాఠశాల ప్రాంగణాల్లో అపరిశుభ్రత నెలకొన్నది. చెత్తా చెదారాన్ని ఊ డ్చే దిక్కు లేక.. విద్యార్థులు, ఉపాధ్యాయులు, టీచర్లు పారిశుధ్య కార్మికులుగా అవతారమెత్తే దుస్థితి పాలమూరులో నెలకొన్నది.
జూలై 9న పాలమూరు జిల్లా పర్యటనకు వచ్చిన సీఎం రేవంత్రెడ్డి ఫైలట్ ప్రాజెక్టుగా పాలమూరులో అమ్మ ఆదర్శ కమిటీల ద్వారా ఎంపిక చేసిన సిబ్బందితోనే పారిశుధ్య కార్యక్రమాలు చేపడుతున్నట్లు ప్రకటించి 68రోజులకు పైనే గడుస్తున్నా.. నేటికీ ఎటువంటి పురోగతి కన్పించడం లేదు. దీంతో సరస్వతీ నిలయాలు అపరిశుభ్రతకు చిరునామాగా దర్శనమిస్తున్నాయి. మున్సిపల్, పంచాయ తీ కార్మికులు పారిశుధ్య చర్యలు చేపడుతున్నారని గతంలో అధికారులు ప్రకటించినా.. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా అనేక ప్రభుత్వ పాఠశాలల్లో మరుగుదొడ్లు, మూత్రశాలల వద్ద పారిశుధ్య చర్యలు కొరవడటంతో పిచ్చిమొక్కలతో నిండిపోతున్నాయి. ఈనెల 15వ తేదీ సీఎం మరోసారి పాలమూరు కు రానున్న నేపథ్యంలో అయినా ఆయన ఇచ్చిన హామీ అమలుకు చర్యలు చేపడతారా.? లేదా.? అనేది ఆసక్తికరంగా మారింది.
ప్రతి స్కూల్లో వందల సంఖ్యలో విద్యార్థులు, పదుల సంఖ్యలో ఉపాధ్యాయులు ఉండటంతో మరుగుదొడ్ల నిర్వహణ సక్రమంగా లేకపోవడంతో అంతా అపరిశుభ్ర పరిస్థితులు నెలకొంటున్నాయి. కొన్ని చోట్ల పాఠశాల తరగతి గ దులు, వరండాల్లో పారిశుధ్య చర్యలు ఉపాధ్యాయులు, వి ద్యార్థులు కలిసి శుభ్రం చేసుకుంటున్నప్పటికీ మరుగుదొడ్ల విషయంలో వెనుకంజ వేస్తుండటంతో అవి అపరిశుభ్రతకు నిలయాలుగా మారుతున్నాయి. వాటి పరిసరాల్లో పిచ్చిమొక్కలతో నిండి విషపురుగులకు నిలయంగా మారుతున్నాయని ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లో పారిశుధ్య చర్యలను చేపట్టేందుకు అక్కడక్కడా ఆయా పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయు లు తలా కొంత డబ్బులు వేసుకొని ప్రైవేట్ వ్యక్తులతో పారిశుధ్య చర్యలను చేపడుతున్నారు. దీంతో కొన్ని పాఠశాలల్లో పారిశుధ్య నిర్వహణ ఫర్వాలేదని చెప్పవచ్చు.
ఉమ్మడి జిల్లాలో పంచాయతీల్లో అరకొర వేతనాలతో కాలం వెళ్లదీస్తున్న పంచాయతీ కార్మికులు తమకు ఇప్పటికే పనిభారం ఎక్కువగా ఉండటంతో పాటు బండెడు చాకిరి చేస్తున్నామని వాపోతున్నారు. సి బ్బంది తక్కువ.. ఇబ్బందులు ఎక్కువ ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నా రు. పాఠశాలల పరిశుభ్రత బాధ్యతలను అదనంగా తమ నెత్తిపై మోపడం ఇ బ్బందిగా ఉందంటున్నారు. ప్రభుత్వం తమకు ఇచ్చే వేతనం కంటే మూడింతలు అదనంగా పనులు చేయించుకుంటోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.