మహబూబ్‌నగర్ కలెక్టరేట్, ఏప్రిల్ 22: ఇంటర్ ఫలితాల్లో వాగ్దేవి జూనియర్ కళాశాల విద్యార్థులు ప్ర భంజనం సృ ష్టిస్తూ విజయకేతనం ఎగరవేశారని ఆ కళాశాల కరస్పాండెంట్ విజేత వెంకట్‌రెడ్డి తెలిపారు. మొదటి సంవత్సరం ఎంపీసీ విభాగంలో అమీనా 468 మార్కులతో రాష్ట్రస్థాయి ర్యాంక్ సాధించిందన్నారు. అక్షయశ్రీ 466 మార్కులు, అమృత వర్షిణి, వైశాలి 465 మార్కులు సాధించారు.
మొదటి సంవత్సరం బైపీసీలో సంజన 436 మార్కులతో రాష్ట్రస్థా యి ర్యాంక్ సాధించగా ఫరీహా, పాయల్సింగ్, మదియా తరహా 435 మార్కులు సాధించారని తెలిపారు. సెకండ్ ఇయర్ ఎంపీసీ విభాగంలో నవనీత్‌గౌడ్ 992 మార్కులు, బైపీసీ విభాగంలో రబ్ష 991 మార్కులు, సపూరా 989 మార్కులతో అత్యుత్తమ ప్రతిభ కనబర్చారన్నారు.
ఇంతటి ఘన విజయాన్ని సాధించడానికి అ ధ్యాపకులంతా ఇన్నోవేటివ్ సైంటిఫిక్ టీచింగ్ అప్రోచ్‌తో నాణ్యమైన బోధన అందించి విజయం సాధించినట్లు పేర్కొన్నారు. ఇదే స్ఫూర్తితో భవిష్యత్‌లో కూడా ఉత్తమ ప్రతిభ కనబర్చి ఉన్నత స్థాయికి ఎదగాలని విద్యార్థులకు సూచించారు.
అనంతరం ఉత్తమ ప్రతిభ కనబర్చిన వి ద్యార్థులను అభినందించారు. కార్యక్రమం లో ప్రిన్సిపాల్ గీతాదేవి, అకాడమీ ఇన్‌ఛార్జి పావనిరెడ్డి, యాజమాన్య సభ్యులు శివకుమార్, రాఘవేంద్రరావు, నాగేందర్, సతీశ్‌రెడ్డి, బాబుల్‌రెడ్డి, రఘువరన్రెడ్డి, వైస్ ప్రిన్సిపాల్ జ్యోతినందన్‌రెడ్డి, ఎంసెట్ ఇన్‌ఛార్జి షాకీర్, ఎగ్జామినేషన్ ఇన్‌ఛార్జి చెన్నయ్య, యాకూబ్, హుస్సేన్‌తోపాటు అధ్యాపకులు పాల్గొన్నారు.