జడ్చర్ల టౌన్, మే 10 : పదోతరగతి ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు టాపర్లుగా నిలిచారు. బాలికలు అత్యధిక ఉత్తీర్ణత సాధించి తమ సత్తాను చాటుకున్నారు. జడ్చర్ల నియోజకవర్గంలో మొత్తం 49 జెడ్పీ హైస్కూల్స్‌లలో 2,615మంది పరీక్షలు రాయగా 1,548మంది ఉ త్తీర్ణత సాధించారు. జడ్చర్ల మండలంలోని గిరిజన గురుకుల పాఠశాల విద్యార్థి ఆర్.సునీల్‌నాయక్ 9.8 పా యింట్లు, మైనార్టీ బాలికల గురుకులంలో కీర్తన, ఝాన్సీ 9.7 పాయింట్లు సాధించారు. పోచమ్మగడ్డతండాలోని బాలానగర్ సాంఘిక సంక్షేమ పాఠశాలలో అభిషేక్ 9.8 పాయింట్లు, రాహుల్, సిద్ధార్థ 9.7 పాయింట్లు సాధించారు. బాదేపల్లి జెడ్పీహైస్కూల్ విద్యార్థి విశాల్ 9.5 పా యింట్లు సాధించి టాపర్లుగా నిలిచారు. పట్టణంలోని మొత్తం 15 ప్రయివేటు పాఠశాలల్లో మొత్తం 583 మం ది విద్యార్థులు పరీక్షలు రాయగా, 509 మంది విద్యార్థు లు ఉత్తీర్ణత సాధించారు. మిడ్జిల్ మండలంలో 5 పాఠశాలలకు చెందిన 207మంది పరీక్షలు రాయగా, 113 మంది ఉత్తీర్ణత సాధించారు. కేజీబీవీకి చెందిన లత, సం ధ్య 9 పాయింట్లు సాధించి టాపర్లుగా నిలిచారు. రాజాపూర్ మండలంలో నాలుగు పాఠశాలలకుగానూ 228 మంది పరీక్షలు రాయగా, 110 మంది ఉత్తీర్ణత సాధించారు. బాలానగర్ మండలంలో 10 పాఠశాలలకుగానూ 502మంది పరీక్షలు రాయగా, 368 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. తెలంగాణ బాలికల రెసిడెన్షియల్ పాఠశాలలో 79 మందికి 79 మంది ఉత్తీర్ణత సాధించా రు. కాగా ప్రవళిక, గౌతమి, రక్షితారెడ్డి 10/10 పా యింట్లు సాధించారు.
మహబూబ్‌నగర్ టౌన్, మే 10 : జిల్లాలోని మైనార్టీ గు రుకులాల విద్యార్థులు 91.1 శాతం ఉత్తీర్ణత సాధించా రు. మహబూబ్‌నగర్‌లోని గురుకులాల్లో 621మంది వి ద్యార్థులు పరీక్షకు హాజరుకాగా, 566 మంది ఉత్తీర్ణులయ్యారు. ఉత్తమ ఫలితాలు సాధించడంపై మైనార్టీ సంక్షేమశాఖ అధికారి టైటస్‌పాల్, ఆర్ఎల్సీ ఖాజాబవోద్దీన్ విద్యార్థులను అభినందించారు. మైనార్టీ గురుకులం బా లుర-3 పాఠశాలలో 57 మంది విద్యార్థులు పరీక్షలు రా యగా.. అందులో 55 మంది ఉత్తీర్ణత సాధించినట్లు ప్రి న్సిపాల్ ముజాఫర్ రజా తెలిపారు. పాఠశాలలో 96.5 శాతం ఉత్తీర్ణత సాధించగా.. 9.8 జీపీఏతో విద్యార్థి కె. నరేంద్ర మహబూబ్‌నగర్ జిల్లాలోని మైనార్టీ గురుకులం పాఠశాలల్లో రెండో స్థానంలో నిలిచారన్నారు. ఈ సందర్భంగా ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులను, ఉపాధ్యాయ బృందంను డీఎండబ్ల్యూవో టైటస్‌పాల్, మహబూబ్‌నగర్ ఆర్ఎల్సీ-1 బహుద్దీన్, విజిలెన్స్ అధికారులు జమీర్ ఖాన్, మహమూద్ ఆలం, అకాడమిక్ కో ఆర్డినేటర్ సలీం అభినందించారు.
దేవరకద్ర, మే 10 : మైనార్టీ గురుకుల బాలుర-2లో విద్యార్థి అభినయ్ కుమార్‌గౌడ్ 10/10 మార్కులు సాధించి మండల టాపర్‌గా నిలిచినట్లు ఎంఈవో జయశ్రీ బుధవారం తెలిపారు. మండలకేంద్రంలోని మహాత్మా జ్యోతిరావు ఫూలే పాఠశాలలో 100శాతం విద్యార్థులు సత్తాచాటారన్నారు. మండలంలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో మొత్తం 761మందికిగానూ 641మంది ఉతీర్ణత సాధించినట్లు ఎంఈవో వెల్లడించారు.
మూసాపేట, మే 10 : మూసాపేట జెడ్పీహైస్కూల్‌కు చెందిన ఆశ వర్కర్ గౌరమ్మ, శ్యామ్ దంపతుల కూతురు వైష్ణవి 10కి 10 పాయింట్లు సాధించి మండల టాపర్‌గా నిలిచింది. అదేవిధంగా జానంపేట పాఠశాలకు చెందిన వేదాంతరెడ్డి 9.5పాయింట్లు సాధించి రెండోస్థానంలో నిలువగా, నిజాలాపూర్ జెడ్పీహైస్కూల్‌కు చెందిన ప్రవళిక 9.2, వేముల జెడ్పీహైస్కూల్‌కు చెందిన శ్రీకాంత్ 9.2 పాయింట్లు సాధించి మూడోస్థానంలో నిలిచారు. మండలస్థాయిలో 274మందికిగానూ 137మం ది ఉత్తీర్ణత సాధించినట్లు ఎంఈవో రాజేశ్వర్‌రెడ్డి తెలిపారు.
హన్వాడ, మే 10 : పది ఫలితాల్లో మహాత్మాజ్యోతిరావు ఫూలే పాఠశాల విద్యార్థులు 95శాతం ఉత్తీర్ణత సాధించారు. వేపూర్లోని ఉర్దూ మీడియంలో ఏడుగురు, హన్వాడ ఉర్దూమీడియంలో నలుగురు 100శాతం ఉత్తీర్ణత సాధించారు. మండలం మొత్తంగా 442మందికిగానూ 291మంది ఉత్తీర్ణత సాధించారు.
మూసాపేట(అడ్డాకుల), మే 10 : అడ్డాకుల జెడ్పీహైస్కూల్‌కు చెందిన జ్యోతి 8.3 పాయింట్లు సాధించి మం డల టాపర్‌గా నిలిచింది. శాఖాపూర్ జెడ్పీ హైస్కూల్‌కు చెందిన స్పందన 8.2, కందూరు జెడ్పీహైస్కూల్‌కు పల్లె కార్తీక్ 8.2, పొన్నకల్ జెడ్పీహైస్కూల్‌కు చెందిన శివకుమార్ 8.2 పాయింట్లు సాధించి రెండోస్థానంలో నిలిచారు. మండలంలో 250మందికిగానూ 107 మంది (43శాతం) ఉత్తీర్ణత సాధించినట్లు ఎంఈవో తెలిపారు.
దేవరకద్ర రూరల్(కౌకుంట్ల), మే 10 : కౌకుంట్ల జెడ్పీహెచ్ఎస్లో 84మందికిగానూ 39మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. ఝాన్సీ 8.3పాయింట్లు సాధించగా.. పేరూర్ జెడ్పీహెచ్ఎస్లో చంద్రకాంత్ 8.5పాయింట్లు సాధించాడు. చిన్నచింతకుంట మండలం బండర్‌పల్లి జెడ్పీహైస్కూల్లో సౌమ్యశ్రీ 9.2 పాయింట్లు సాధించ గా, చింతకుంట జెడ్పీహెచ్ఎస్లో లక్ష్మీనారాయణ 9.7, వెన్నెల 9.3, లాల్‌కోటలో కావేరి 8.2, ముచ్చింతలలో విజయ్‌కుమార్ 7.5, ఉంద్యాలలో శ్రావణి 8.2, అప్పంపల్లిలో చందు 8.7, కేజీబీవీలో ఐశ్వర్య 9.3 పాయిం ట్లు, నాగేశ్వరి 9.2, పెద్దవడ్డెమాన్లో అరుణ 9.5 పాయింట్లు సాధించారు.
కోయిలకొండ, మే 10: బీసీ గురుకుల విద్యార్థి మల్లేశ్ 10/10 మార్కులు సాధించి మండల టాపర్‌గా నిలిచాడు. చంద్రాస్‌పల్లి ఉన్నత పాఠశాల, బీసీ గురుకులంలో 90శాతం ఉత్తీర్ణత సాధించారు.
భూత్పూర్, మే 10 : పది ఫలితాల్లో మండల విద్యార్థులు 60శాతం ఉత్తీర్ణత సాధించారు. 424మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 256 మంది ఉత్తీర్ణత సాధించారు. జ్యోతిబాఫూలే పాఠశాల విద్యార్థిని జె.భవాని 9.7, తాటికొండ జెడ్పీహెచ్‌ఎస్‌కు చెందిన జె.విజయప్రసాద్ 9, భూత్పూర్ జెడ్పీహెచ్‌ఎస్‌కు చెందిన శుభం తివారీ, సుమయ్య 9 పాయింట్లు సాధించినట్లు ఎంఈవో నాగయ్య తెలిపారు. కరివెనకు చెందిన నర్సింహులు-మంగమ్మల కుమార్తె భవాని 9.7జీపీఏ సాధించడంపై ప్రత్యేకాధికారి బస్వరాజ్ హర్షం వ్యక్తం చేశారు.