
మక్తల్ టౌన్, డిసెంబర్ 21: విద్యార్థులు క్రమశిక్షణను అలవర్చుకోవాలని మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి అన్నారు. మక్తల్ పట్టణంలోని ఉన్నత పాఠశాలకు పూర్వవిద్యార్థులైన కొత్త నర్సింహులు, కిరణ్‌కుమార్ రూ.3లక్షల విలువైన వంద బెంచీలు వితరణ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చిట్టెం చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణతో ఉన్నప్పుడే ఉన్నత చదువులు చదివి ప్రయోజకులుగా స్థిరపడుతారని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యను అభ్యసించి పాఠశాలకు కృతజ్ఞతగా బెంచీలు అందజేసిన పూర్వ విద్యార్థులను ఎమ్మెల్యే చిట్టెం అభినందించారు. అదేవిధంగా విద్యార్థులు ప్రతి ఒక్కరూ కరోనా జాగ్రత్తలు పాటించాలని, అదేవిధంగా ఉపాధ్యాయులు విద్యార్థులకు చదువుతోపాటు క్రీడల్లో పాల్గొనే విధంగా కృషిచేయాలని తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే చిట్టెంను ఉపాధ్యాయులు శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మహిపాల్‌రెడ్డి, హెచ్ఎం జగదీశ్వరాచారి, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు శ్రీనివాస్‌గుప్తా, పీఈటీ, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
నత్తనడకన మున్సిపాలిటీ అభివృద్ధి పనులు
నత్తనడకన మున్సిపాలిటీ పనులు కొనసాగుతున్నాయని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి సూచించారు. మంగళవారం మక్తల్ మున్సిపాలిటీలోని ఎనిమిదో వార్డు కొత్తగార్లపల్లిలో రూ.18లక్షలతో చేపట్టిన పార్క్‌ను ఎమ్మెల్యే చిట్టెం సందర్శించి పార్క్ పనులు వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మున్సిపాలిటీ అభివృద్ధి కోసం రూ.కోటి80లక్షలతో ఇప్పటికే పనులు చేపట్టేందుకు కృషి చేశానని, అదేవిధంగా మినీ ట్యాంక్‌బండ్‌పై పార్క్ ఏర్పాటు చేసేందుకు సహకరించానని, అయినప్పటికీ మున్సిపాలిటీ అధికారులు పనులు పూర్తిచేయడంలేదని విస్మయం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా మున్సిపాలిటీలో అభివృద్ధి పనులపై అధికారులు, పాలకవర్గం దృష్టిపెట్టాలని తెలిపారు. సీఎం కేసీఆర్‌తో మాట్లాడి మక్తల్ అభివృద్ధికి రూ.5కోట్లు విడుదల చేయించానని తెలిపారు. కార్యక్రమంలో కమిషనర్ రాజయ్య, ఏఈ నాగశివ, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మహిపాల్‌రెడ్డి, నర్సింహారెడ్డి, నేతాజీ పాల్గొన్నారు.