పాలమూరు, డిసెంబర్ 30 : బాలికలకు సరైన విద్య అందినప్పుడే బాలికా వికాసం సాధ్యమవుతుందని ఎైక్సైజ్, క్రీ డా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ పేర్కొన్నారు. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని క్రీడా మైదానం సమీపంలో ఉన్న గిరిజన వసతి గృహంలో ఏర్పాటు చే సిన కంప్యూటర్ ల్యాబ్‌ను మంత్రి ప్రా రంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ హన్వాడ మండలంలోని ఓ తం డాలో పర్యటిస్తుండగా ఒక బాలిక ఇంటి పనులు చేస్తూ కనిపించిందన్నారు. ఎం దుకు పనులు చేస్తున్నావని అడిగితే వస తి, సౌకర్యం లేక చదువు ఆపేసినట్లు త నకు తెలియజేయగా.. వెంటనే జిల్లా కేం ద్రంలోని గిరిజన వసతి గృహంలో చే ర్పించినట్లు తెలిపారు. గురుకులాల్లో కా ర్పొరేట్ స్థాయిలో బోధన అందుతున్నదని, ఈ ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. సెల్‌ఫోన్‌తో కాలక్షేపం చే యొద్దన్నారు. కంప్యూటర్ ల్యాబ్‌లో వి ద్యార్థులు అనుమానాలను నివృత్తి చేసుకోవాలని సూచించారు. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే వారు రెఫరెన్స్ కోసం వినియోగించాలని కోరారు. వసతి గృహం లో ఏమైనా ఇబ్బందులు ఉంటే తన దృష్టికి తీసుకురావాలన్నారు. వసతిగృహాలను తనిఖీ చేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో ముడా చై ర్మన్ గంజి వెంకన్న, మున్సిపల్ వైస్ చై ర్మన్ గణేశ్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గిరిధర్‌రెడ్డి, గిరిజన సంక్షేమ అధికారి ఛత్రూనాయక్ తదితరులు పాల్గొన్నారు.
మహబూబ్‌నగర్ అర్బన్, డిసెంబర్ 30 : తెలంగాణ ఏర్పడిన తర్వాత కులవృత్తులకు సరైన న్యాయం జరిగి పూర్వవైభవం సంతరించుకున్నదని మంత్రి శ్రీ నివాస్‌గౌడ్ పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని హైటెక్ ఫంక్షన్హాల్లో జిల్లా పశుపరిశోధన కేంద్రం, ఇండియన్ రెడ్‌క్రాస్ సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని మంత్రి ప్రారంభించా రు. 220 మంది రక్తదానం చేయగా వా రికి ప్రశంసా పత్రాలను మంత్రి శ్రీనివాస్‌గౌడ్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ రాక ముందు గోపాలమిత్రలకు నెలకు కేవలం రూ.3 వేలు మాత్రమే ఇచ్చేవారని.. నేడు రూ. 11వేల వేతనం అందజేస్తున్నామని తెలిపారు. సీఎం కేసీఆర్ పాలనలో తాము సంతోషంగా ఉన్నామని, గుర్తింపు, గౌర వం లభిస్తున్నదని స్వయంగా గోపాలమిత్రలు చెప్పడం ఆనందంగగా ఉన్నదన్నా రు. గురువారం తాను కర్ణాటకలోని గుల్బర్గా జిల్లా పర్యటనకు వెళ్లానని.. అక్కడ అన్ని కులవృత్తులు తీవ్ర అన్యాయానికి గురయ్యాయని వివరించారు.
మహబూబ్‌నగర్ జిల్లాను రాష్ట్రంలో ముందు వరుసలో నిలపడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నట్లు మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. జిల్లా కేంద్రంలో నూతన కోర్టు భవన నిర్మాణానికి వెటర్నరీ పాలిటెక్నిక్ సమీపంలో 10 ఎకరాల స్థలం కేటాయించామని స్పష్టం చేశారు. అం దుకోసం పశుపరిశోధన కేంద్రానికి 20 ఎకరాల భూమిని కేటాయిస్తున్నామని వెల్లడించారు. వెటర్నరీ, పాలిటెక్నిక్, ప శు పరిశోధన కేంద్రం ఇక్కడి నుంచి తరిలిపోతున్నాయని కొందరు పనిగట్టుకొని దుష్ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తా రు. వాటిని ఎక్కడికీ తరిలించడం లేద ని, ఇక్కడే కొనసాగిస్తామని చెప్పారు. కా ర్యక్రమంలో రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు గోపాల్ యాదవ్, గొర్రెల కా పరుల సంఘం జిల్లా అధ్యక్షుడు శాం తన్న యాదవ్, పశు సంవర్ధక శాఖ జా యింట్ డైరెక్టర్ మధుసూదన్‌గౌడ్, రెడ్‌క్రాస్ చైర్మన్ నటరాజ్, నాయకులు యాదగిరిగౌడ్, శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు.