మరికల్ : ప్రపంచ జల సంరక్షణ దినోత్సవం ( Water conserves Day ) సందర్భంగా మరికల్ మండల కేంద్రంలోని శ్రీవాణి ఉన్నత పాఠశాల విద్యార్థులు శనివారం ర్యాలీని ( Rally ) నిర్వహించారు. ఈ సందర్భంగా ‘ నీటిని సంరక్షించుకుందాం.. భూమిని కాపాడుదాం’ అంటూ నినాదాలు చేస్తూ నీటిని సంరక్షించే విధానాల ప్లాకార్డులను ప్రదర్శిస్తూ మండల కేంద్రంలో ర్యాలీ నిర్వహించారు.
పాఠశాల నుంచి చౌరస్తా , సరస్వతి దేవి దేవాలయం, తదితర ప్రాంతాల్లో ర్యాలీ కొనసాగింది. నీరే మనిషికి జీవనాధారం అంటూ విద్యార్థులు నినాదాలు చేస్తూ ర్యాలీని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ వినీతమ్మ, కరస్పాండెంట్ పూర్ణిమ వెంకటేశ్వర్లు, ఉపాధ్యాయులు రాఘవేందర్, మరికల్ యువకమండలి మాజీ ఉపాధ్యక్షుడు కూసూరు రవి తోపాటు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.