గ్రామ సింహాలు స్వైరవిహారం చేస్తున్నాయి. పల్లె, పట్నం అన్న తేడా లేకుండా వీటి బెడద తీవ్రమైంది. ఇండ్ల నుంచి వీధిల్లోకి రావాలన్నా తడబాటే.. బైక్పై వెళ్తున్నప్పుడు కంగారు.. పిల్లలను పనుల మీద బయటకు పంపించాలన్నా భయం.. భయం. చిన్నారులు ఇంటి ముందు సరదాగా ఆడుకోవాలన్నా ఆందోళన తప్పడం లేదు. ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని, ఏ కుక్క ఎక్కడి నుంచి దాడికి తెగబడి ప్రాణాలు తీస్తుందేమోనన్న భయం నెలకొన్నది. ఇప్పటికే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పలువురు చిన్నారుల తోపాటు పెద్దవారు కుక్క కాటుకు గురయ్యారు. అయినా వీధి కుక్కల నియంత్రణకు అధికారులు తీసుకుంటున్న చర్యలు కరువయ్యాయన్న ఆరోపణలు ఉన్నాయి. దీంతో ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతున్నది.
– నాగర్కర్నూల్/వనపర్తి(నమస్తే తెలంగాణ) /గద్వాల/నారాయణపేట, ఆగస్టు 12
గ్రామ సింహాలు.. ఇంటికి నమ్మకస్తుడిగా ముద్రపడిన ఈ పేరు వింటే ప్రజలు ప్రస్తుతం కంగారు పడే పరిస్థితులు నెలకొన్నాయి. కాలనీల్లో నివాస ప్రాంతాల నుంచి ప్రధాన రహదారులపైకి గుంపులు గుంపులుగా వచ్చేస్తున్న ఈ వీధి కుక్కలతో ప్రజలకు ప్రాణాపాయం కలుగుతోంది. ఈ ప్రమాదకర వీధి కుక్కల నియంత్రణకు చర్యలు చేపట్టాల్సిన ఆయా శాఖల అధికారులు పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఫలితంగా ఊరూరా ఏటేటా కుక్కకాట్ల బాధితులు పెరిగిపోతున్నారు.
గ్రామీణ, పట్టణ ప్రాంతాలకు వీధి కుక్కలు చుక్కలు చూపిస్తున్నాయి. ఇంటికి రక్షణగా నమ్మకమైన జంతువుగా వీటి పేరుంది. అలాంటి ఇంట్లో పెంపుడు కుక్కలను మినహాయిస్తే వీధి కుక్కల స్వైర విహారం ఇటీవలి కాలంలో పెరిగింది. గ్రామాల్లో, పట్టణాల్లో ఎక్కడ చూ సినా గుంపులు గుంపులుగా సంచరిస్తున్నాయి. పట్టణాల్లో కుక్కల గుంపులు చికాకు కలిగిస్తున్నాయి. ప్రధాన రహదారుల వెంట తిరుగుతూ బైక్ వాహనదారులకు, కార్లకూ ఇబ్బంది కలిగిస్తున్నాయి.
రెండు నెలల కిందట నాగర్కర్నూల్ జిల్లాలో ఓ ద్విచక్ర వాహనదారుడు కుక్క ఎదురుగా వచ్చి మృత్యువాత పడ్డాడు. దీనికి కారణం పట్టణాల్లో మాంస విక్రయదారులు, హోటళ్లు, రెస్టారెంట్లు, మున్సిపాల్టీ సిబ్బంది నిర్లక్ష్యమే అన్న విషయం స్పష్టమవుతోంది. రోడ్లపై చేపలు, మాంసం విక్రయాలు చేపడుతుండటంతో ఆ వ్యర్థాల కోసం కుక్కలు అక్కడే తిరుగాడుతున్నాయి. మాంసం తీసుకెళ్లేందుకు వచ్చే ప్రజలూ వీటిని చూసి భయపడుతున్నారు.
కొందరు మున్సిపాల్టీ సిబ్బంది చెత్తను డంపింగ్ యార్డులకు బదులుగా పట్టణ శివారు ప్రాం తాల్లో పారవేస్తున్నారు. అలాగే హోటల్, రెస్టారెంట్ల వ్యాపారులు కూడా పాడైన ఆహార వ్యర్థాలను విసిరేస్తున్నారు. ఈ చెత్తలోని కుళ్లిన ఆహార వ్యర్థాలను తినేందుకు శునకాలు పోటీ పడుతున్నాయి. ఒకదానిపై మరొకటి, ఒక గుంపు, మరో గుంపు కుక్కలుగా పోట్లాడుతున్నాయి. ఈ క్రమంలో అటుగా వెళ్లే ప్రజలు, వాహనదారులు భయంతో పరిసరాలను దాటుతున్నారు. ప లు చోట్ల కుక్కలు పిల్లలు, మహిళలు, వృద్ధులపై దా డులు చేస్తున్న సంఘటనలు ప్రజలను భయ కంపితులను చేస్తున్నాయి.
ఏ కుక్క ఎటువైపు నుంచి వచ్చి కరుస్తుందో..? అన్నట్లుగా వీటి సంఖ్య పెరుగుతూనే వస్తోంది. అయినా వీధి కుక్కలను నియంత్రించేందుకు మాత్రం ఎ లాంటి చర్యలు తీసుకోవడం లేదన్న ఆ రోపణలు ఉన్నాయి. బీఆర్ఎస్ ప్రభు త్వం కుక్కల సంరక్షణ కేంద్రాలను ఏర్పా టు చేసింది. నాగర్కర్నూల్ జిల్లా కేంద్రంలో పూర్తయినా ఉపయోగించడం లేదు. మిగిలిన చాలా చోట్ల ఈ భవనాల నిర్మాణాలు చేపట్టలే దు. వీధి కుక్కలను ఈ కుక్కల సంరక్షణ కేంద్రాలకు తరలించి మున్సిపల్, పంచాయతీ అధికారులు, పశుసంవర్ధక శాఖ సిబ్బందితో శస్త్ర చికిత్సలు, ముందస్తుగా కుక్కలకు వ్యాక్సిన్ చేయించాల్సి ఉంది. ఈ దిశగా ఎలాంటి కార్యాచరణ కనిపించడం లేదని ప్రజల నుంచి ఆరోపణలు వినిపిస్తున్నాయి.
నాగర్కర్నూల్ జిల్లాలో కుక్కకాటు బాధితుల సంఖ్య ప్రతి సంవత్సరం పెరుగుతూ వస్తోంది. 2021లో 558 మంది, 2022లో 912 మంది, 2023లో 1,255 మంది కుక్క కాట్ల బా ధితులుగా మారారు. ఈ సారి ఇప్పటి వరకు ఏకంగా 1,743 మంది గాయపడ్డారు. ఈ మేరకు వీధి కుక్కల స్వైర విహారం, వీటితో కలుగుతున్న ఇబ్బందులు స్పష్టమవుతున్నాయి. కాటుకు గురైన బాధితులు, కుటుంబీకుల్లో ఆందోళన నెలకొంటుంది. వీధి కుక్కల నియంత్రణపై జిల్లా అధికార యంత్రాంగం కదిలితేనే పూర్తిస్థాయిలో పరిస్థితి అదుపులోకి వచ్చే అవకాశముంది.
మహబూబ్నగర్, ఆగస్టు 12 : పాలమూరు జిల్లాలో వీధి కుక్కలు రెచ్చిపోతున్నాయి. పాదచారులు, వీధుల్లోని ఇండ్ల ఎదుట ఆడుకుంటున్న చిన్నారులపై దాడులకు తెగబడుతున్నాయి. వీధుల్లో తిరుగుతూ స్థానికులను భయబ్రాంతులకు గురిచేస్తున్నాయి. దీంతో స్థానికులు ప్రజాప్రతినిధులు, అధికారులకు మొరపెట్టుకుంటున్నారు. మహబూబ్నగర్ జనరల్ దవాఖానలో గుం పులు.. గుంపులుగా సంచరిస్తున్నాయి. దీంతో వైద్యశాలకు వచ్చే రోగులు భ యాందోళనలు వ్య క్తం చేస్తున్నారు. ఇటీవల జిల్లా కేంద్రంలోని ఎర్రమన్నుగుట్ట పరిధిలోని హరిజనతండాకు చెందిన చిన్నారి భవాని(6) కుక్క దాడిలో తీ వ్రంగా గాయపడింది. ఇంటి ఆవరణలో సోదరుడితో కలిసి ఆడుకుంటుండగా.. వీధి కుక్కలు దాడి చేశాయి.
వీధి కుక్కల నియంత్రణకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటాం. కుక్కల సంరక్షణ కేంద్రం లో రూ. 15 లక్షల విలువైన పరికరాలు కావాల్సి ఉంది. ఏఈ బదిలీపై వెళ్లారు. కొత్తగా వచ్చిన వెంటనే ఎస్టిమేషన్ చేయించి పరికరాలు తెప్పిస్తాం. పశువైద్యాధికారి నియామకం కావాల్సి ఉంది. వీధి కుక్కలు రోడ్ల వెంట తిరుగకుండా చూస్తాం. మాంసం, చికెన్ వ్యాపారులు, హోటళ్ల నిర్వాహకులు వ్యర్థాలను బయటపడేయకుండా ఇప్పటికే ఆదేశాలు జారీ చేశాం. ఎవరైనా నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తీసుకుంటాం.