మహబూబ్ నగర్, కలెక్టరేట్ ఏప్రిల్ 10 : మహబూబ్ నగర్ జిల్లా టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటీవలి కాలంలో దొంగతనానికి గురైన మొత్తం100 మొబైల్ ఫోన్లను గుర్తించి, వాటిని బాధితులకు జిల్లా ఎస్పీ డి. జానకి అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. మొబైల్ ఫోన్లు చోరీకి గురైన పౌరులు సీఈఐఆర్ (Central Equipment Identity Register) పోర్టల్ ద్వారా తమ ఫోన్లను ట్రాక్ చేసి తిరిగి పొందే అవకాశం ఉందని వివరించారు. చోరీ జరిగిన వెంటనే ఫిర్యాదు చేయడం ద్వారా దొంగతనమైన మొబైల్ ఫోన్లను సాంకేతిక పరిజ్ఞానంతో గుర్తించవచ్చని, ఇది ప్రభుత్వ ప్రవేశపెట్టిన ప్రగతిశీల టెక్నాలజీపై ఆధారపడిన ఒక గొప్ప సాధనమని చెప్పారు.
సైబర్ క్రైమ్ విషయంలో ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఎస్పీ స్వయంగా సైబర్ మోసాలు, డిజిటల్ అరెస్ట్, ఓటీపీ మోసాలు, బ్యాంకింగ్ మోసాలు వంటి అంశాలపై వివరణ ఇచ్చారు. ప్రజలలో ఉన్న అవగాహన స్థాయిని అంచనా వేయడానికి ఎస్పీ కొన్ని ప్రశ్నలు అడిగారు. సరైన సమాధానాలు ఇచ్చిన ఎలికిచర్ల గ్రామానికి చెందిన అడ్డకల శివుడు బెస్ట్ సిటిజన్‌గా ఎంపికై ఎస్పీ చేతుల మీదుగా ప్రశంసాపత్రం అందుకున్నాడు. ఫోన్ల రికరవరీలో కృషి చేసిన సిబ్బందిని క్యాష్ రివార్డుతో ఎస్పీ సత్కరించారు.