మహబూబ్‌నగర్‌టౌన్, జనవరి 3 : జాతీయస్థా యి హ్యాండ్‌బాల్ టోర్నీ రాష్ట్ర జట్లు విజేతగా నిలువాలని విశ్రాంత గురుకులాల రాష్ట్ర క్రీడాధికారి రమేశ్‌బాబు అన్నారు. హర్యాన రాష్ట్రంలో ఈ నెల 5 నుంచి 9వ తేదీ వరకు జరగనున్న జాతీయస్థాయి ఎస్జీఎఫ్ అండర్-19 హ్యాండ్‌బాల్ టోర్నీలో పా ల్గొనే రాష్ట్ర బాల, బాలికల జట్లు తరలివెళ్లాయి. బుధవారం ఆయన క్రీడాకారులను కలిసి అభినందించా రు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చదువుతోపాటు క్రీడల్లో రాణించాలని, క్రీడాకారులకు బంగారు భవిష్యత్తు ఉంటుందన్నారు. స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని, జాతీయస్థాయి టోర్నీ క్రీ డాకారులు ప్రతిభ చాటాలని ఆకాంక్షించారు. హ్యాం డ్బాల్లో ఎంతో మంది జిల్లా క్రీడాకారులు అద్భు త ప్రతిభ చాటారని గుర్తుచేశారు. కార్యక్రమంలో ఎస్జీఎఫ్ సెక్రటరీ రమేశ్‌బాబు, అసిస్టెంట్ సెక్రటరీ వేణుగోపాల్, జిల్లా హ్యాండ్‌బాల్ సెక్రటరీ జియాఉద్దీన్, హెచ్‌వోడీ బాలరాజు, కోచ్‌లు అహ్మద్హుస్సే న్, పద్మినీగుప్తా, మేనేజర్లు కృష్ణయ్య, శంకర్ ఉన్నారు.
బాలుర జట్టు : ధన్రాజ్గౌడ్, మహ్మద్అబ్దుల్జూనేద్, చరిత్‌రెడ్డి (మహబూబ్‌నగర్), బి.రోహిత్భార్గవరెడ్డి (రంగారెడ్డి), మధురోహిత్, సాయికార్తీక్, పులిరూబి కిరణ్ (కరీంగనగర్), పొట్టు సాయి, కె.చ క్రధర్(సిరిసిల్ల), కృష్ణ(జయశంకర్భూపాలపల్లి), రఫీయొద్దీన్(సంగారెడ్డి), సాయితేజ (వికారాబాద్), విజయగిరి కృష్ణ (జనగాం), బాబు సాహెబ్ (హైదరాబాద్), రాంకుమార్ (మంచిర్యాల), రమేశ్ (సిద్ధిపేట), కృష్టయ్య (మేడ్చల్), అంజి (నల్లగొండ), బి.కిరణ్(కామారెడ్డి).
బాలికల జట్టు : సుదీక్ష (జనగాం), బి.జ్యోతి, సంధ్య (వరంగల్), వైష్ణవి (హన్మకొండ), కె.జ్యోతి (నారాయణపేట), శివానీచంద్ర (మహబూబ్‌నగర్), బి.తన్మయి(ఖమ్మం), మీనాక్షి(కొత్తగూడెం), సంజన (హైదరాబాద్), అక్షయ(సిద్దిపేట), వర్ష (నిజామాబాద్), శ్రావ్య (పెద్దపల్లి), నవనీత (నిజామాబాద్), మహిన్ (నల్లగొండ), శ్రీవాణి (నారాయణపేట), గీతా (ఆసిఫాబాద్), రాఘవి (కరీంనగర్).