మహబూబ్‌నగర్‌టౌన్, డిసెంబర్ 30 : ఉపాధ్యాయ వృత్తి గొప్పదని మై నార్టీ గురుకులాల రాష్ట్ర కార్యదర్శి షఫీవుల్లా అన్నారు. శుక్రవారం జిల్లా కేం ద్రంలోని ఆల్‌మదీనా కళాశాలలో ఛాత్ర ఉపాధ్యాయులకు కేరీర్ గైడెన్స్‌పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మా ట్లాడుతూ సమాజ నిర్మాతలు ఉపాధ్యాయులన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మైనార్టీ విద్యార్థుల విద్యాభివృద్ధికి కృషి చేస్తున్నదని చెప్పారు. ఆల్‌మదీనా కళాశాలలో చదివిన విద్యార్థులు ఎందరో ఉన్నత స్థాయిలో ఉన్నారన్నారు. పోటీ పరీక్షల కు సిద్ధం కావాలని, ప్రభుత్వం ఉద్యోగా ల పక్రియ కొనసాగుతుందన్నారు. అ నంతరం మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఇంతియాజ్‌ఇసాక్ మాట్లాడుతూ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేసి అందరి అభ్యున్నతికి కృషి చేస్తున్నదన్నారు. అలాగే మైనార్టీ గురుకులాన్ని తనిఖీ చేశారు. కార్యక్రమంలో ఆల్‌మదీనా ప్రతినిధులు పాల్గొన్నారు.
జడ్చర్ల టౌన్, డిసెంబర్ 30 : రాష్ట్రం ఏర్పడ్డాక మైనార్టీ గురుకులాల్లో పేద మైనార్టీ విద్యార్థులకు మెరుగైన విద్య అందుతున్నదని షఫీవుల్లా చెప్పారు. జ డ్చర్లలోని మైనార్టీ బాలికల, బాలుర గు రుకుల పాఠశాలలను శుక్రవారం ఆయ న సందర్శించారు. వంటగదికి వెళ్లి భోజనాన్ని పరిశీలించారు. పాఠ్యాంశాల రివిజన్, విద్యాబోధన గురించి విద్యార్థుల ను అడిగి తెలుసుకున్నారు. పదోతరగతి విద్యార్థులతో మాట్లాడుతూ వార్షిక పరీక్షలకు ఒత్తిడికి గురికాకుండా మానసికంగా సిద్ధం కావాలని సూచించారు. వై ద్యశిబిరాన్ని సందర్శించారు. కొందరు విద్యార్థులకు యూనిఫాం, షూ లేకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు త ప్పవని హెచ్చరించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 54 సొంత భవనాలు నిర్మాణంలో ఉం డగా, 14 భవనాలు పూర్తయ్యాయని తెలిపారు. మిగిలినవి విడుతల వారీగా నిర్మించేందకు ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. ఈ స్కూళ్లల్లో చదివిన పలువురు విద్యార్థులు ఎంబీబీఎస్, ఐఐఐటీ, పాలిసెట్ వంటి అనేక కోర్సుల్లో ప్రవేశాలు పొందారన్నారు. ఇదంతా సీఎం కేసీఆర్ చలువ వల్లే అన్నారు. గురుకులాల్లోని సమస్యలను పరిష్కరిస్తామన్నారు. అం తకుముందు విద్యార్థులు ఆయనకు ఘ న స్వాగతం పలికారు. ఆయన వెంట జిల్లా ఇన్చార్జి గౌస్ మొహివుద్దీన్, ఆర్ఎల్పీ జమీర్ అహ్మద్, బాలికల, బాలు ర ప్రిన్సిపాల్స్ కల్పన, పారిజాత, విద్యార్థులు పాల్గొన్నారు.