మూసాపేట : మహబూబ్ నగర్ జిల్లా మూసపేట మండలం నిజాలాపూర్లో బుధవారం 108 అంబులెన్సు లో ఆక్సిజన్ అందక మృతి చెందిన బొజ్జయ్య కుటుంబాన్ని ( Bojjayya family ) రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి ( Ala Venkateswar Reddy ) కోరారు . బొజ్జయ్య మృతదేహానికి గురువారం పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ప్రభుత్వం నిర్లక్ష్యానికి ఒక నిండు ప్రాణం బలైందని, కుటుంబం రోడ్డున పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. బాధ్యులైన వారి పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం మానవతా దృక్పధంతో బొజ్జయ్య కుటుంబాన్ని ఆదుకోవాలని కోరారు. జిల్లాకు ఇన్చార్జి గా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఉన్నప్పటికీ వైద్య రంగం పరిస్థితి దారుణంగా ఉండడం శోచనీయమని అన్నారు. అత్యవసర సమయాల్లో 108 కి ఫోన్ చేస్తే ఆదుకోవాల్సింది పోయి అసౌకర్యాలతో రోగులను ప్రాణాల మీదకు తేవడం విచారకమరమని అన్నారు.