రాజాపూర్, నవంబర్ 13 : రైతుల సంక్షేమానికి దేశంలో ఎక్కడాలేని పథకాలను అమలు చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు పక్షపాతిగా నిలిచారని డీసీఎంఎస్ చైర్మన్ పట్ల ప్రభాకర్‌రెడ్డి అన్నారు. మండలంలోని తిర్మలాపూర్ రైతువేదిక ఆవరణలో ఆదివారం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర రైతాంగానికి ఎలాంటి కష్టం రాకుండా ప్రభుత్వం కృషి చేస్తున్నదని తెలిపారు. ఆరుగాలం కష్టించి పండించిన ధాన్యాన్ని విక్రయించేందుకు రైతులు అవస్థలు పడొద్దని ప్రభుత్వం ఊరూరా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నదన్నారు. రైతులు నాణ్యమైన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చి మద్దతు ధర పొందాలని సూచించారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ మోహన్‌నాయక్, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు నర్సింహులు, సర్పంచుల సంఘం మండల అధ్యక్షుడు బచ్చిరెడ్డి, సర్పంచ్ మహేశ్వరి, నాయకులు మహిపాల్‌రెడ్డి, నరహరి, రమేశ్‌నాయక్, పుల్లారెడ్డి, మల్లయ్య, గోవర్ధన్‌రెడ్డి, బాలయ్య, చంద్రయ్య, నర్సింహులు, వెంకట్రాంరెడ్డి, జంగయ్య తదితరులు పాల్గొన్నారు.
ప్రతి గింజనూ కొనుగోలు చేస్తాం
రైతులు పండించిన ప్రతి గింజ నూ ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని జెడ్పీ వైస్‌చైర్మన్ యాదయ్య, పీఏసీసీఎస్ చైర్మన్ పాలెం సుదర్శన్‌గౌడ్ అన్నా రు. జడ్చర్ల మండలంలోని పెద్ద ఆదిరాలలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతు సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పని చేస్తున్నదన్నారు. ధాన్యం విక్రయానికి రైతులు ఇబ్బందులు పడొద్ద ని ప్రభుత్వమే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి మద్దతు ధరకు ధాన్యాన్ని కొంటున్నదని తెలిపారు. కార్యక్రమంలో మాజీ వైస్‌ఎంపీపీ గోవర్ధన్‌రెడ్డి, సర్పంచ్ కృష్ణాబాయి, రమేశ్‌జీ, సింగిల్‌విండో సీఈవో యాదగిరి, డైరెక్టర్లు నర్సింహారెడ్డి, రామకృష్ణారెడ్డి, ఉపసర్పంచ్ మల్లికార్జున్, శంకర్‌నాయక్, వెంకటేశ్, రైతుబంధు సమితి కోఆర్డినేటర్ రామలింగారెడ్డి, రమేశ్, మల్లేశ్, శ్రీశైలం పాల్గొన్నారు.
కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి
ప్రభుత్వం ఏర్పాటు చేసి న ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని సర్పంచ్ కృష్ణయ్య కోరారు. మండలకేంద్రంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేంద్రంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని నిర్వాహకులకు సూచించారు. కార్యక్రమంలో ఐకేపీ బుక్ కీపర్లు వెం కటేశ్, నరేశ్ తదితరులు పాల్గొన్నారు.