విస్తృతంగా తనిఖీలు
ఎలాంటి ఆధారాలు లేకుండా తరలిస్తున్న రూ.1.85లక్షలను సీజ్ చేసినట్లు ఎస్సై శ్రీనివాస్ తెలిపారు. ఎస్సై కథనం మేరకు.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూలు జిల్లా పత్తికొండ మండలం పెరవల్లికి చెందిన రాంచందర్ శనివారం టోల్గేట్ మీదుగా కారులో మహబూబ్‌నగర్‌కు వెళ్తున్నాడు.
- పుల్లూరు టోల్గేట్ వద్ద రూ.1.85లక్షలు కృష్ణా బ్రిడ్జి వద్ద రూ.1.50లక్షలు పట్టివేత
ఉండవెల్లి, మార్చి 30 : ఎలాంటి ఆధారాలు లేకుండా తరలిస్తున్న రూ.1.85లక్షలను సీజ్ చేసినట్లు ఎస్సై శ్రీనివాస్ తెలిపారు. ఎస్సై కథనం మేరకు.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూలు జిల్లా పత్తికొండ మండలం పెరవల్లికి చెందిన రాంచందర్ శనివారం టోల్గేట్ మీదుగా కారులో మహబూబ్‌నగర్‌కు వెళ్తున్నాడు.
ఈక్రమంలో పుల్లూరు చెక్‌పోస్ట్ వద్ద వాహనాల తనిఖీలో భాగంగా అతడి వద్ద గుర్తించిన రూ.1.85లక్షల నగదును స్వాధీనం చేసుకొని జిల్లా గ్రీవెన్స్ కమిటీకి అప్పగించినట్లు ఎస్సై వెల్లడించారు. రాంచందర్ మహబూబ్‌నగర్‌లో ఎక్సైజ్ శాఖలో కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.
ఆధారాలు లేకుండా నగదు తరలించొద్దు
మక్తల్ టౌన్, మార్చి 30 : పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఆధారాలు లేకుండా రూ.50వేలకు మించి నగదు తరలిస్తే సీజ్ చేస్తామని కృష్ణ ఎస్సై ఎండీ నవీద్ పేర్కొన్నారు. ఎస్పీ యోగేశ్ గౌతమ్ ఆదేశాల మేరకు మక్తల్ నియోజకవర్గంలోని కృష్ణానది బ్రిడ్జి సమీపంలో ఏర్పాటు చేసిన చెక్‌పోస్ట్ వద్ద శనివారం వాహనాల తనిఖీ నిర్వహించారు.
ఈ సందర్భంగా కర్ణాటక నుంచి కారులో వస్తున్న జహీరుద్దీన్ వద్ద రూ.1.50లక్షలను గుర్తించారు. నగదుకు సంబంధించి సరైన ధ్రువీకరణపత్రాలు లేకపోవడంతో సీజ్ చేసి గ్రీవెన్స్ కమిటీకి పంపినట్లు ఎస్సై వెల్లడించారు. ఎన్నికల కోడ్ ముగిసే వరకు రూ.50వేలకు మించి తీసుకెళ్తే అందుకు సంబంధించిన రసీదులను వెంట తెచ్చుకోవాలని ఆయన సూచించారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Governors | బ్రేకింగ్.. ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు..!
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

