కేసీఆర్‌ను ముట్టుకుంటే రాష్ట్రం అగ్నిగుండమే..
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావును ముట్టుకుంటే రాష్ట్రం అగ్నిగుండం అవుతుందని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ హెచ్చరించారు. కేసులకు జైళ్లకు భయపడే వ్యక్తి కాదని ప్రాణాలకు తెగించి తెలంగాణ రాష్ట్రం సాధించిన ధీరుడు అంటు కొనియాడారు.
- రాష్ట్రంలో రాక్షస పాలన
- మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్
మహబూబ్‌నగర్ అర్బన్, ఫిబ్రవరి 1 : తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావును ముట్టుకుంటే రాష్ట్రం అగ్నిగుండం అవుతుందని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ హెచ్చరించారు. కేసులకు జైళ్లకు భయపడే వ్యక్తి కాదని ప్రాణాలకు తెగించి తెలంగాణ రాష్ట్రం సాధించిన ధీరుడు అంటు కొనియాడారు. అని ఫోన్ ట్యాంపరింగ్ కేసు విచారణలో కేసీఆర్‌కు సీట్ నోటీసులు పంపడాన్ని నిరసిస్తూ ఆదివారం జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నిరసన వ్యక్తం చేశారు.
అనంతరం అంబేద్కర్ చౌరస్తా వరకు ర్యాలీగా వెళ్లి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు. ఈ సం దర్భంగా మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం తెచ్చిన నాయకుడు కేసీఆర్‌ను ఫోన్ ట్యాంపిగ్ కేసుకు సంబంధం లేదు. హైకోర్టు నిబంధనల ప్రకారం ఎక్కడ ఉంటే అక్కడ విచారణ చేపట్టాలి.. పోలీసులు నిబంధనల ను పక్కన పెట్టి గోడకు నోటీసులు అంటించడం సిగ్గు చేటన్నారు. అన్ని వర్గాలకు సంక్షేమం, అభివృద్ధి ఫలాలు అందించిన కేసీఆర్‌ను వేధింపులకు గురిచేయడం సరికాదన్నారు.
పోలీసులు అధికార పార్టీకి అనుకూలంగా పనిచేయొద్దని నిష్పక్ష పాతంగా విధులు నిర్వహించాలన్నారు. తెలంగాణ సాధనలో కేసులు, జైళ్లకు భయపడలేదు కొట్లాడి పోరాటం చేసి రాష్టాన్ని సాధించామన్నారు. కార్యక్రమంలో పుర ఎన్నికల పరిశీలకులు అలీ మాస్కతి, రాష్ట్ర కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఇంతియాజ్, గ్రంథాలయాల సంస్థ మాజీ చైర్మన్ రాజేశ్వర్‌గౌడ్, మున్సిపల్ మాజీ చైర్మన్ నర్సింహులు, వెంకటయ్య, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఆంజనేయులు, రెహమాన్, గణేశ్, నవకాంత్, శ్రీనివాస్‌రెడ్డి, సుధాకర్‌తోపాటు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

