పాలమూరు, ఆగస్టు 26: కృష్ణ్టాష్ట్టమి వేడుకలను మహబూబ్‌నగర్, నారాయణ పేట జిల్లాల్లో సోమవారం ఘనంగా నిర్వ హించారు. మహబూబ్‌నగర్‌లోని పద్మావతీకాలనీ శ్రీకృష్ణుడి ఆలయంలో సోమవా రం కృష్ణ్టాష్ట్టమి వేడుకలు వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉదయం స్వామివారికి అభిషేకం, ప్రత్యేక అలంకరణ, విశేషపూజలు చేశారు. తెల్లవారుజా ము నుంచి స్వామివారి దర్శనానికి క్యూలైన్లో భక్తులు బారులుదీరారు. అనంతరం స్వామివారిని దర్శించుకొని ప్రత్యేకపూజలు చేశారు.
సాయంత్రం విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో శ్రీకృష్ణుడి శోభాయాత్ర నిర్వహించారు. రాంమందిరం నుంచి తెలంగాణ చౌరస్తా వరకు భక్తిభజనలు, కోలాటాల మధ్య వైభవంగా నిర్వహించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఆనంద్‌గౌడ్ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. చిన్నిశ్రీకృష్ణుడు, గోపికల వేషధారణలతో చిన్నారులు ఆకట్టుకున్నారు. కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్ సభ్యులు, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.
జడ్చర్ల, ఆగస్టు 26: పట్టణంలోని సరస్వతీ శిశుమందిర్ విద్యార్థులు శ్రీకృష్ణుడు, గోపికల వేషధారణలో పట్టణంలో ఊరేగిం పు నిర్వహించారు. ఈ సందర్భంగా సాం స్కృతిక కార్యక్రమాలు, కోలాటం, ఉట్టుకొట్టే కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమంలో పాఠశాల అధ్యక్షురాలు పద్మలీల, కార్యదర్శి కృష్ణ, గంధంజ్యోతి ఉన్నారు. బాదేపల్లిలోని విద్యానగర్ కాలనీలో సంతోషిమాత ఆలయంలో కృష్ణాష్టమి వేడుకలు నిర్వహించారు. చిన్నికృష్ణుడికి పంచామృతాభిషేకం, డోలారోహణ, శ్రీకృష్ణ తులాభారం, భక్తులకు అన్నదానం చేశారు.
నవాబ్‌పేట, ఆగస్టు 26: మండల కేం ద్రంతోపాటు వివిధ గ్రామాల్లో సోమవారం కృష్ణాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. అలాగే యన్మన్గండ్ల, తీగల్‌పల్లి, కూచూర్, కారుకొండ, కొల్లూరు, ఇప్పటూ ర్, కొండాపూర్, లోకిరేవులో యువకులు ఉత్సాహంగా ఉట్లుకొట్టారు. కార్యక్రమం లో యాదవసంఘం మండలాధ్యక్షుడు యాదయ్యయాదవ్, మార్కెట్ మాజీ చైర్మ న్ లక్ష్మయ్య, మల్లేశ్‌యాదవ్ పాల్గొన్నారు.
ఊట్కూర్, ఆగస్ట్టు 26: మండల కేంద్రంలోని గీతాంజలి పబ్లిక్ కాన్వెంట్ స్కూల్, కొత్తపల్లి, పగిడిమర్రి అంగన్వాడీ కేంద్రా ల్లో సోమవారం కృష్ణాష్టమి వేడుకలు ఘ నంగా నిర్వహించారు. చిన్నారులు శ్రీకృష్ణు డు, గోపికల వేషధారణలో ఆకట్టుకున్నా రు. కార్యక్రమంలో ఐసీడీఎస్ సూపర్వైజర్ అంజలి, అంగన్వాడీ టీచర్ ఇందిర పాలొన్నారు. మండలకేంద్రంలో సరస్వతీ శిశు మందిర్ విద్యార్థులు ప్రధాన చౌరస్తాలో ఏర్పాటు చేసిన పాలుట్లను పగులగొట్టారు.
మూసాపేట(అడ్డాకుల), ఆగస్టు 26: అడ్డాకుల కందూరు, రాచాల, పొన్నకల్, గుడిబండతోపాటు మూసాపేట మండల కేంద్రం, వేముల, కొమిరెడ్డిపల్లి, జానంపే ట, పోల్కంపల్లి తదితర గ్రామాల్లో సోమవారం శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను ప్రజ లు ఘనంగా నిర్వహించారు. ఆయా గ్రా మాల యాదవ సంఘం ఆధ్వర్యంలోఉట్లు కొట్టే కార్యక్రమం నిర్వహించారు. యువకులు ఉత్సాహంగా పాల్గొన్నారు. కార్యక్రమంలో దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్‌రె డ్డి అడ్డాకులలో నిర్వహించిన కార్యక్రమా నికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. అడ్డాకుల మాజీ జెడ్పీటీసీ సభ్యుడు రాజశేఖర్‌రెడ్డి, సింగిల్‌విండో చైర్మన్ జితేందర్‌రెడ్డి, మాజీ ప్రజాప్రతినిధులు ఉన్నారు.
మద్దూర్(కొత్తపల్లి), ఆగస్టు 26: మండ ల కేంద్రంలో సోమవారం కృష్ణష్టామి వేడుకలు ఘనంగా నిర్వహించారు. చిన్నారుల వేషధారణతో సంస్కృతిక కార్యక్రమా లు నిర్వహిస్తూ ర్యాలీ తీశారు. అనంతరం పాతబస్టాండ్ చౌరస్తాలో ఉట్టుకొట్టారు.
మరికల్, ఆగస్టు 26: శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా సోమవారం మండల కేంద్రంలోని హన్మాన్‌వాడ ఆంజనేయ స్వామి ఆలయ ప్రాంగణంలో పాలుట్లు కొట్టారు. చిన్నారులు శ్రీకృష్ణుడు, గోపికల వేషధారణలతో ఊరేగింపు నిర్వహించారు. పల్లకీసేవ, పాలుట్ల కార్యక్రమం నిర్వహించారు.
ధన్వాడ, ఆగస్టు 26: మండలంలోని కిష్టాపూర్, మందిపల్లితండాల్లో సోమవారం కృష్ణాష్టమి వేడుకలు నిర్వహించా రు. కార్యక్రమాల్లో శ్రీనివాస్ యాదవ్, ఆంజనేయులు, వెంకట్‌రెడ్డి, రాఘవేందర్‌రెడ్డి, సునీల్‌రెడ్డి, సాయిలు, గోపాల్, కర్రెప్ప పాల్గొన్నారు.
భూత్పూర్,ఆగస్టు 26: మండల వ్యాప్తంగా శ్రీకృష్ణాష్టమి వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంతో పాటు అమిస్తాపూర్, పోతులమడుగు, కొత్తమొల్గర, వెల్కిచర్ల, మద్దిగట్ల, తాటికొండలోనూ నిర్వహించారు.