పాలమూరు, ఏప్రిల్ 19 : జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ మహిళా డిగ్రీ కళాశాలలో శుక్రవారం కళాశాల ఫిజికల్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో గ్రాండ్ స్పోట్స్ మీట్ డే నిర్వహించారు. గత నెలలో 12విభాగాల్లో నిర్వహించిన ఎన్టీఆర్ డీజీసీ ఉమెన్కప్ క్రీడా పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా క్రీడ ల, యువజన సర్వీసుల అధికారి శ్రీనివాస్ హాజరై మాట్లాడారు. చదువుతోపాటు క్రీడలు కూడా విద్యార్థులకు అవసరమన్నారు. కార్యక్రమం లో ఫిజికల్ డైరెక్టర్ సత్యభాస్కర్‌రెడ్డి, ప్రిన్సిపాల్ విజయ్‌కుమార్, విజేత వెంకట్‌రెడ్డి, వైస్ ప్రిన్సిపాల్ గంగాధర్, అమీనా ముంతాజ్జహాన్, కో-ఆర్డినేటర్ విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.