
మహబూబ్‌నగర్ టౌన్, డిసెంబర్ 21 : స్థానిక ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఉమ్మడి జిల్లా పాలిటెక్నిక్ క్రీడాపోటీలు హోరాహొరీగా సాగుతున్నాయి. మంగళవా రం నిర్వహించిన పోటీల్లో బాలుర విభాగంలో ఖోఖో, వా లీబాల్, కబడ్డీ విభాగంలో మహబూబ్‌నగర్ ప్రభుత్వ పాలిటెక్నిక్ బాలుర జట్లు విజేతగా నిలిచింది. ఖోఖో రన్నర్ గ ద్వాల, వాలీబాల్, కబడ్డీ రన్నర్‌గా జేపీఎన్సీ పాలిటెక్నిక్ జట్లు నిలిచాయి. బాలికల విభాగంలో పోటీలు రసవత్త రంగా కొనసాగుతున్నాయి. బుధవారంతో పోటీలు ముగు స్తాయని నిర్వాహకులు తెలిపారు.
క్రీడల్లో గెలుపుపోటములు సహజం
క్రీడల్లో గెలుపుపోటములు సహజమాని క్రీడా స్ఫూర్తిని చాటాలని మహబూబ్‌నగర్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపాల్ జోగయ్య అన్నారు. స్థానిక ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఉమ్మడి జిల్లా పాలిటెక్నిక్ క్రీడా పో టీలను రెండోరోజూ ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చదువుతోపాటు క్రీడల్లో రాణించాలని, క్రీడాకారులకు బంగారు భవిష్యత్తు ఉంటుందన్నారు. క్రీడా కోటలో ఉద్యోగ అవకాశాలు ఉంటాయన్నారు.
టోర్నీలో ప్రతిభ చాటి విజేతలుగా నిలువాలని, రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక కావాలని ఆకాక్షించారు. జిల్లాలో ని మహబూబ్‌నగర్,గద్వాల, కోస్గి, వడ్డేపల్లి, జేపీఎన్సీ, స్విట్స్, వనపర్తి కేడీఆర్, పెబ్బెర్ పాలిటెక్నిక్ కళాశాలల నుం చి 383 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. కార్యక్రమంలో వనపర్తి ప్రిన్సిపాల్ చంద్రశేఖర్, కోస్గి ప్రిన్సిపాల్ పరమేశ్వరి, హెచ్వోడీలు అరుణ, శశిభూషణ్, రాజేశ్వరి, పీడీ నా గరాజు, పీఆర్వోలు రాజేశ్వరి, ఉదయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.