బీఎస్ఎఫ్ అదుపులో తెలంగాణవాసి
భారత్-పాకిస్థాన్ సరిహద్దు సమీపంలో సోమవారం ఉదయం అనుమానాస్పదంగా సంచరిస్తున్న ఓ తెలంగాణ యువకుడిని నిర్బంధించిన స్థానికులు బీఎస్ఎఫ్ సిబ్బందికి అప్పగించారు. రాజస్థాన్‌లోని మ్యాజలార్ ప్రాంతానికి చెందిన గుంజన్గఢ్ గ్రామ సమీపంలో సరిహద్దుల వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న ఓ వ్యక్తిని స్థానికులు అడ్డుకుని ప్రశ్నించారు. ఆ వ్యక్తి ఇచ్చిన జవాబులు సంతృప్తికరంగా లేకపోవడంతో అతడిని బీఎస్ఎఫ్ సిబ్బందికి అప్పగించినట్లు స్థానిక వర్గాలు తెలిపాయి.
- భారత్-పాక్ సరిహద్దు వద్ద అనుమానాస్పదంగా సంచారం
- నిర్బంధించి బీఎస్ఎఫ్కు అప్పగించిన స్థానికులు
జైసల్మేర్: భారత్-పాకిస్థాన్ సరిహద్దు సమీపంలో సోమవారం ఉదయం అనుమానాస్పదంగా సంచరిస్తున్న ఓ తెలంగాణ యువకుడిని నిర్బంధించిన స్థానికులు బీఎస్ఎఫ్ సిబ్బందికి అప్పగించారు. రాజస్థాన్‌లోని మ్యాజలార్ ప్రాంతానికి చెందిన గుంజన్గఢ్ గ్రామ సమీపంలో సరిహద్దుల వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న ఓ వ్యక్తిని స్థానికులు అడ్డుకుని ప్రశ్నించారు. ఆ వ్యక్తి ఇచ్చిన జవాబులు సంతృప్తికరంగా లేకపోవడంతో అతడిని బీఎస్ఎఫ్ సిబ్బందికి అప్పగించినట్లు స్థానిక వర్గాలు తెలిపాయి. ఆ వ్యక్తిని తెలంగాణకు చెందిన 38 ఏండ్ల మహ్మద్ అష్ఫాఖ్ హుస్సేన్‌గా గుర్తించారు.
అతని వద్ద నుంచి భారతీయ పాస్‌పోర్టును భద్రతా సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు. వేరే రాష్ర్టానికి చెందిన వ్యక్తి సున్నితమైన సరిహద్దు ప్రాంతంలోకి అనధికారికంగా ప్రవేశించడాన్ని భద్రతా సంస్థలు తీవ్రంగా పరిగణిస్తాయి. సరిహద్దు సమీపంలో సంచరిస్తున్న ఈ వ్యక్తి గురించి భద్రతా సిబ్బంది ఆరా తీస్తున్నారు. తెలంగాణ నుంచి జైసల్మేర్ లాంటి మారుమూల సరిహద్దు ప్రాంతానికి ప్రయాణించడానికి దారితీసిన పరిస్థితుల గురించి ప్రశ్నిస్తున్నారు. స్థానికులతో ఏమైనా పరిచయాలున్నాయా, లేక ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అన్న విషయాలను అడుగుతున్నారు. దీనిపై స్థానిక పోలీసుల నుంచి అధికారిక ప్రకటన ఏదీ ఇప్పటివరకు వెలువడలేదు. ఆ వ్యక్తిని అధికారికంగా అరెస్టు చేసిందీ లేనిదీ కూడా తెలియరాలేదు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kavya Maran Marriage | కేటీఆర్‌కు కళానిధి మారన్ దంపతుల ఆహ్వానం.. కావ్య మారన్ వివాహ రిసెప్షన్‌కు రావాలని పిలుపు!
Bathukamma Celebrations | ఎతుబార్పల్లిలో అంబరాన్నంటిన బతుకమ్మ సంబరాలు..
KTR | స్వదేశీ మొబిలిటీ ప్లాట్‌ఫామ్ ‘రుటూర్’ ప్రారంభం.. డ్రైవర్లకు కమీషన్ లేని సేవలే లక్ష్యం!
JCJ Results | మూడు రోజుల వ్యవధిలోనే రెండు కొలువులు.. జూనియర్ సివిల్ జడ్జిగా పెద్దపల్లి యువతి హారిక..!
హస్తినలో పరిమళించిన తెలంగాణ పూల పండుగ.. తెలంగాణ భవన్లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

