ఊరుకొండ : మానసిక ఉల్లాసానికి క్రీడలు( Sports ) ఎంతో అవసరమని జడ్చర్ల ఎమ్మెల్యే జానంపల్లి అనిరుద్ రెడ్డి (MLA Anirudh Reddy ) అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో నాలుగు రోజులుగా నిర్వహిస్తున్న క్రికెట్ టోర్నమెంట్ ( Cricket Tournament ) పోటీలు ముగిసాయి. ఈ సందర్భంగా విజేతలకు ఆయన హాజరై బహుమతులు అందజేశారు. ఆయన మాట్లాడుతూ నేటి యువత పని ఒత్తిడికి లోనవుతున్నారని, వాటి నుంచి ఉపశమనం పొందడానికి క్రీడలు ఎంతో అవసరమని అన్నారు.
చదువుతో పాటు క్రీడలు కూడ ఎంతో ముఖ్యమంని పేర్కొన్నారు. క్రీడల్లో రాణింపు వల్ల అనేక పేరు, ప్రతిష్టలతో పాటు ఉద్యోగ అవకాశాలు వస్తాయని, దీంతో జీవితంలో స్థిరపడవచ్చని సూచించారు. క్రీడలో రాణించాలంటే క్రమశిక్షణ, పట్టుదల ఎంతో అవసరమని గుర్తు చేశారు. నాలుగురోజులుగా ఎన్నో వ్యయప్రయాసాల కోర్చి క్రికెట్ పోటీలను నిర్వహించిన నిర్వాహకులను అభినందించారు.