జోగులాంబ గద్వాల : అనాథ శిశువులను సంరక్షించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టిందని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ( Collector Rizwan Basha) వెల్లడించారు. ప్రజా పాలన -ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న చైల్డ్ సేఫ్టీ, ప్రొటెక్షన్, అడాప్షన్, ఆఫ్టర్ కేర్ వారోత్సవాల సందర్భంగా శుక్రవారం గద్వాల ప్రభుత్వ ఆసుపత్రిలో క్రాడిల్ బేబీ విభాగాన్ని కలెక్టర్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలకు ఏర్పాటుచేసిన బాల భరోసా ప్రత్యేక వైద్య శిబిరానికి వచ్చిన చిన్నారులు, వారి తల్లిదండ్రులతో మాట్లాడారు. దివ్యాంగ చిన్నారులకు అందిస్తున్న చికిత్స, ఇతర సదుపాయాలను అడిగి తెలుసుకున్నారు.
దివ్యాంగ చిన్నా రులకు నిబంధనలను అనుసరించి సదరం సర్టిఫికెట్లను జారీ చేస్తామన్నారు. తద్వారా వికలాంగ పెన్షన్ పొందేందుకు అవకాశం ఉంద న్నారు.కార్యక్ర మంలో డీడబ్ల్యూవో సునంద, డీఎంహెచ్వో సంధ్య కిరణ్మయి, జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి పర్యవేక్షకులు ఇందిర, డీసీపీవో నరసింహా, వైద్యాధికారులు పాల్గొన్నారు.