జోగులాంబ గద్వాల : గ్రూప్–I, II, III, IV, ఎస్.ఎస్.సి ,ఆర్.ఆర్.బి, బ్యాంకింగ్ సర్వీసుల కోసం బీసీ స్టడీ సర్కిల్ (BC Study Circle) లో ప్రత్యేక కోచింగ్ (Special coaching ) కార్యక్రమం ప్రారంభించినట్లు జిల్లా స్టడీ సర్కిల్ డైరెక్టర్ రాములు ( Ramulu ) తెలిపారు. సోమవారం జిల్లా కేంద్రంలోని బీసీ స్టడీ సర్కిల్లో ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని బీసీ సంక్షేమ శాఖ ఆధికారులు అక్బర్ పాషా, ఈడీ ఎస్సీ నిశిత తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్టడీ సర్కిల్ డైరెక్టర్ మాట్లాడుతూ గ్రామీణ, పట్టణ ప్రాంతాల అభ్యాసకులకు సమాన అవకాశాలు కల్పించడమే తమ సంస్థ లక్ష్యమని వెల్లడించారు.
నిరుపేద, వెనుకబడిన వర్గాల అభ్యర్థులకు ఉచితంగా నాణ్యమైన 5 నెలల వరకు శిక్షణ అందిస్తామని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగాల సాధనలో నిరంతర కృషి, క్రమశిక్షణ, నిబద్ధతతో పాటు సమగ్ర అధ్యయనం అవసరమని సూచించారు.ఈ కోచింగ్ ప్రోగ్రామ్‌లో ప్రావీణ్యం కలిగిన ఫ్యాకల్టీ బృందం ఆధ్వర్యంలో పాఠ్యాంశాలపై పద్ధతి, సమగ్ర శిక్షణ, పరీక్షా నమూనాలపై ప్రత్యేక వర్క్‌షాప్‌లు, మాక్ టెస్టులు నిర్వహించబడతాయని వివరించారు .ఆసక్తి గల అభ్యర్థులు మరిన్ని వివరాలకు ఫోన్ నంబర్ 9985434941 ద్వారా సంప్రదించవచ్చని పేర్కొన్నారు.