మహబూబ్ నగర్ : ఇటీవల జిల్లాలో కురిసిన వర్షాలు( Rains) , వరదలకు ( Floods ) దెబ్బతిన్న ప్రాంతాలను రెవెన్యూ ( విపత్తుల నిర్వహణ శాఖ ) ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ( Special Chief Secretary ) అరవింద్ కుమార్
( Aravind Kumar ) గురువారం సందర్శించారు. దివిటిపల్లి అమరాజా ఫ్యాక్టరీ కి వెళ్లే టీజీఐఐసీ కాంప్లెక్స్ వద్ద దెబ్బతిన్న అప్రోచ్ రోడ్డును, అమిస్తాపూర్ నుంచి రామదాసు తండా మధ్య దెబ్బతిన్న రోడ్డును, జిల్లా కేంద్రంలో పాలిటెక్నిక్ కాలేజీ వెళ్లే వర్షపు నీటి తో నిండిన రైల్వే అండర్ బ్రిడ్జిని పరిశీలించారు.
దెబ్బతిన్న రహదారి, రైల్వే అండర్ బ్రిడ్జి పునరుద్ధరణ పనులు గురించి కలెక్టర్ విజయేందిర బోయి, సంబంధిత రైల్వే, మున్సిపల్ , అధికారులు వివరించారు. జడ్జర్ల మండలం చిట్టిబోయినపల్లి సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల పాఠశాల, జూనియర్ కళాశాలను సందర్శించి విద్యార్థులతో ముచ్చటించి వారితో కలిసి భోజనం చేశారు. ఆయన వెంట కుమార్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్, రెవెన్యూ అదనపు కలెక్టర్ ఏనుగు నరసింహారెడ్డి తదితరులున్నారు.