చారకొండ, జనవరి 22 : అయోధ్యలో బాలరాముని విగ్రహ ప్రాణప్రతిష్ఠను పురస్కరించుకొని రెండో భద్రాదిగా పేరుగాంచిన శిరుసనగండ్ల సీతారామచంద్రస్వామి ఆలయంలో సోమవారం స్వా మివారి కల్యాణం నిర్వహించారు. వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య రామనామస్మరణలతో వే డుక అట్టహాసంగా జరిగింది. మండలంలోని వివిధ గ్రామాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. ఆ లయంలో స్వామివారిని దర్శించుకొని పూజలు చేశారు.
అనంతరం భక్తులకు అన్నదానం నిర్వహించారు. ఆలయం నుంచి వివిధ గ్రామాల్లో శోభాయాత్ర ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ రామశర్మ, ఈవో రఘు, సర్పంచ్ శారద, ఎంపీటీసీ లక్ష్మణ్‌నాయక్, మాజీ ఎంపీటీసీ న ర్సింహారెడ్డి, రమ్య, ఎంఈవో శంకర్‌నాయక్, అర్చకులు లక్ష్మణ్‌శర్మ, మురళీశర్మ, ప్రవీణ్‌శర్మ ఉన్నారు.