వనపర్తి (నమస్తే తెలంగాణ)/వనపర్తి టౌన్, మార్చి 29 : తెలుగు సాహిత్యంలో సమాజ చైతన్యానికి రాజ్యంపై రాజీలేకుండా మహాకవి దాశరథి కృష్ణమాచార్య ఎన్నో రచనలు చేశారని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని దాచలక్ష్మయ్య ఫంక్షన్హాల్లో దాశరథి కృష్ణమాచార్య జయంతి వేడుకలను మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి అధ్యక్షతన తెలంగాణ సాహితీ కళావేదిక, తెలంగాణ వికాస సమితి సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించారు. దాశరథి జయంత్యుత్సవాలకు ఎ మ్మెల్సీ దేశపతి శ్రీనివాసులు, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఆర్.ఎస్ ప్రవీణ్‌కుమార్, ప్రొఫెసర్ కోటేశ్వర్రావు, శరత్చంద్ర, శివకుమార్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు గట్టుయాదవ్ హాజరయ్యారు.
ముందుగా దాశరథి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి మాట్లాడుతూ.. అతితక్కువ కాలంలో ఎక్కువ రచనలు చేశారని 50ఏండ్ల పాటు సాహిత్యంలోనే ఉన్నారని, ఆంధ్ర మహాసభ, కమ్యూనిస్ట్ బాడీలో పనిచేశారన్నారు. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం దాశరథికి నిజమైన నివాళులర్పించిందని గుర్తు చేశారు. తెలంగాణ ఉన్నంత వరకు దాశరథి పేరు ఉంటుందన్నారు. తెలంగాణ సమాజం ఉన్నంత వరకు దాశరథి చిరస్మరణీయుడిగా ఉంటారని పేర్కొన్నారు. కళలను నెరవేర్చడంలాంటి మహా యుద్ధమే తెలంగాణ సంగ్రామమని, కరవు కాటకాల నంపచి తెలంగాణను దూరం చేసి సస్యశ్యామలమైన తెలంగాణను ఆవిష్కరించేలా దాశరథి రచనలు, కవితలు అద్దం పట్టాయన్నా రు.
దురదృష్ణవశాత్తు నేడు తాత్కాలికమైన ఒడిదుడుకుల్లో మన పయనం కొనసాగుతుందన్నారు. అయినా తట్టుకుని, నిలబడి మళ్లీ సమాజాన్ని, ప్రజలను నిలబెట్టి అజేయమైన శక్తిగా ఎదగడంలో భాగంగానే దాశరథి జ యంతి సభ అంటూ నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు. దాశరథి జీవితకాలంలో పురష్కారాలు ఎనలేనివని, 50 ఏండ్ల సా హిత్యంలో ఎక్కడా రాజీ పడకుండా అద్భుతమైన రచనలను చేసి దాశరథి ఆదర్శనీయంగా నిలిచారని పేర్కొన్నా రు. తెలంగాణ ఉన్నంత వరకు ఆయన ఉంటారని, ప్రతి ఒక్కరూ దాశరథిని స్మరించుకోవడం తెలంగాణలోని ప్రతి పౌరుడి బాధ్యగా పేర్కొన్నారు. సభలో దాశరథిని గుర్తు చేసుకొని మంత్రి నిరంజన్‌రెడ్డి కన్నీరు పెట్టుకున్నారు.
తెలుగు కవిత్వాన్ని సుసంపన్నం చేస్తూ.. తెలంగాణ అస్థిత్వాన్ని దాశరథి కవిత్వం పురివిప్పి నాట్యం చేసిందన్నారు. ఉన్నతమైన భావాలు, ఉదాత్తమైన ఆశయాలు, విప్లవకారుడు, అనువాదకుడు, ఆకాశవాణి ప్రవక్త, వి ఖ్యాత సినీ గేయ రచయిత దాశరథి అంటూ దేశపతి వివరించారు. తెలుగు సాహిత్యంలో తెలంగాణ అస్థిత్వం గురించి దాశరథి ప్రత్యేక ముద్ర వేసుకున్నారని, తెలంగాణ సమాజం ఆత్మావలోకనం చేసుకోవాల్సిన గొప్ప వ్యక్తి ఆయనన్నారు. తెలంగాణ వేదనని తన కవిత్వం ద్వారా బయటి ప్రపంచానికి వెలుగెత్తి చాటిన అత్యంత ధైర్యశాలిగా దాశరథిని కొనియాడారు.
ఆయన కవిత్వం లో తెలంగాణ అస్థిత్వం పురివిప్పి నాట్యం చేసిందన్నారు. తెలంగాణ పోరాటం యావత్తు ప్రపంచాన్ని ఆకర్షించిందని, రష్యా, అమెరికాలాంటి దేశాలను సహితం తెలంగాణ ఉద్యమం వైపు చేసిందన్నారు. రష్యా దేశంలోని ఓ కవి, అలాగే కశ్మీర్‌లోని మరో కవి తెలంగాణ ఉద్యమాన్ని తమ కవిత్వాల ద్వారా వెలుగెత్తే పరిస్థితి దాశరథి వంటి వ్యక్తుల వల్లే సాధ్యమైందని చెప్పారు. ఎందరో కవులు, కళాకారులకు జన్మనిచ్చిన గడ్డ వనపర్తి అని, సారస్వత గిరి శిఖరం సురవరం ప్రతాపరెడ్డి పుట్టిన గడ్డ వనపర్తి ప్రాంతమన్నారు. మాజీ మంత్రి సింగిరెడ్డి ఆధ్వర్యంలో కవులు, కళాకారులను జయంతి కార్యక్రమాలు నిర్వహిస్తూ వనపర్తి చరిత్రను పెంచుతున్నారన్నారు.
ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ మాట్లాడుతూ.. తన బాల్యంలో దాశరథి కృష్ణమాచా ర్య గురించి ఏ తె లుగు టీచర్ బో ధించలేదన్నారు. తెలంగాణలో పుట్టి తెలంగాణ గడ్డ వైభవాన్ని దక్షిణ భారతదేశమంతటా చాటి చెప్పారన్నారు. చదువుకునే రోజుల్లో తెలంగాణ కవుల గురించి తెలుసుకునే అవకాశమే లేదని, దాశరథి సినిమా పా టలు వింటుంటే ఆయనే రచనలు చేశారా అని ఆశ్చర్యం కలిగిస్తుందన్నారు. తెలంగాణ కవులు, కళాకారుల గురించి చర్చ చేయాల్సిన అవసరం ఉందని చెప్పా రు.
టెక్నాలజీకి దూరంగా రోజుకు ఒకగంట పుస్తకాలను చదవాలన్నారు. దాశరథి రాసిన వ్యాసాలను సంపుటిగా పుస్తకావిష్కరణ చేయాల్సిన అవశ్యకత ఈ గడ్డపై ఉందని, అందుకు మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి నడుం కట్టాలని కోరారు. అనంతరం ప్రొఫెసర్ కోటేశ్వరరావు మాట్లాడు తూ.. తాను బ్రాహ్మణ కుటుంబంలో జన్మించినా నిత్యం శ్రమజీవుల చెమట చుక్కలు, దళిత పీడిత, బడుగు, బలహీనవర్గాల చైతన్యాన్ని తన కవిత, రచనలతో చైతన్యం చేశారని ఆయన వెల్లడించారు. కార్యక్రమంలో వాకటి శ్రీధర్, పలుస రమేశ్‌గౌడ్, పలుస శంకర్‌గౌడ్, బలరాం, కవులు బాలరాం, సుబ్బయ్య, శంకర్గౌడ్తోపాటు మేధావులు, కళాకారులు పాల్గొన్నారు.