అమరచింత, అక్టోబర్ 20: పేదల తిరుపతిగా పేరుగాంచిన కురుమూర్తిస్వామి జాతర నెల రోజుల పాటు అంగరంగ వైభవంగా జరగనున్నది. ప్రధాన ఘట్టమైన ఉద్దాల ఉత్సవం రోజు సతీసమేతంగా ధరించే పట్టువస్త్రాలను అమరచింత పద్మశాలీలు నేయడం ఆనవాయితీ. ఈమేరకు గురువారం పద్మశాలీలు పట్టణంలోని భక్తమార్కండేయస్వామి ఆలయంలో పట్టువస్ర్తాలకు వినియోగించే ముడి సరుకులకు వేదపండితులతో ప్రత్యేక పూజలు చేసి నేత పనులను ప్రారంభించారు.
ఈ సందర్భంగా పద్మశాలి సంఘం అధ్యక్ష,కార్యదర్శులు దేవరకొండ లచ్చన్న, పారుపల్లి చింతన్న మా ట్లాడుతూ కొలిచిన వారికి కొంగు బంగారంగా కోరిన కోర్కెలు తీర్చే కురుమూర్తిస్వామికి పట్టువస్ర్తాలను త యారు చేసే అవకాశం రావడం తమ పుర్వజన్మ సుకృతమన్నారు. నియమ నిష్టలతో మడి కట్టుకుని, ఉపవాసాలతో వస్ర్తాలు నేస్తామన్నారు. కార్యక్రమంలో రాజు, సత్యనారాయణ, ఎల్లప్ప, కుమార్, శ్రీను, రాములు, నాగరాజు, సిద్ధరాములు ఉన్నారు.