కల్వకుర్తి రూరల్ : అథ్లెటిక్ క్రీడల్లో క్రీడాకారులు( Sportsmen ) అత్యుత్తమ ప్రతిభను కనబరిచి పతకాలను సాధించి జిల్లా పేరును జాతీయస్థాయిలో ( National level ) నిలపాలని కల్వకుర్తి సీఐ నాగార్జున( CI Nagarjuna) కోరారు. శనివారం కల్వకుర్తి పట్టణంలోని జడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో నాగర్కర్నూల్ జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ విజయేందర్ యాదవ్ , డాక్టర్ స్వాములు ఆధ్వర్యంలో అండర్ 14, 16, 18, 20 విభాగాలలో అథ్లెటిక్ క్రీడలకు జిల్లా స్థాయి క్రీడాకారుల ఎంపిక ను నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి సీఐ నాగార్జున, ఎస్సై మాధవరెడ్డి , పట్టణ రెండో ఎస్సై రాజశేఖర్ ముఖ్యఅతిథిగా హాజరై క్రీడాకారుల ఎంపికను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో సీఐమాట్లాడుతూ క్రీడాకారులు రాష్ట్రస్థాయి క్రీడలకు వెళ్లినపుడు నిర్వాహకులు సూచించిన జాగ్రత్తలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు.
క్రీడలతో స్నేహ సంబంధాలు బలపడడంతో పాటుగా శారీరక మానసిక ఉత్సాహాలు లభించి ఆరోగ్యంగా ఉంటారని పేర్కొన్నారు. క్రీడాకారులకు క్రీడలతో ఉజ్వలమైన భవిష్యత్తు ఉందని వివరించారు. కార్యక్రమంలో సీనియర్ క్రీడాకారుడు స్కైలాబ్ పీడీలు ప్రకాష్ రాజేంద్రప్రసాద్, అంజయ్య, జగన్, క్రీడాకారుల తల్లిదండ్రులు, క్రీడాకారులు పాల్గొన్నారు.