
మహబూబ్‌నగర్, డిసెంబర్ 14: సెకండ్ డోస్ వ్యాక్సినేషన్‌పై ప్రత్యేకదృష్టి పెట్టాలని కలెక్టర్ ఎస్ వెంకట్రావు పేర్కొన్నారు. మంగళవారం జిల్లా, మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఫస్ట్ డోస్ నూటికి నూరుశాతం కృషిచేసిన వారికి కృతజ్ఞతలు తెలిపారు. కష్టపడి పనిచేయడం వల్ల వందశాతం ఫస్ట్ డోస్ వ్యాక్సినేషన్ సాధించడం జరిగిందన్నారు. కొత్త వేరియంట్ ఒమిక్రాన్ రావడానికి అవకాశం ఉందని, ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. ప్రతిఒక్కరూ రెండు డోస్‌లు టీకా వేసుకోవాలని సూచించారు. వారం రోజులపాటు అధికారులు ఇదే మాదిరిగా శ్రమిస్తే వందశాతం లక్ష్యం చేరుకుంటామన్నారు. 18నాటికి మొక్కలు నాటడం పూర్తి చేయాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ తేజస్ నందలాల్‌పవార్, డీఎంహెచ్‌వో డాక్టర్ కృష్ణ, అధికారులు, వైద్యాధికారులు తదితరులు పాల్గొన్నారు.
కూలీల వద్దకే వ్యాక్సిన్
మండలంలో డాక్టర్ ప్రతాప్చౌహాన్ ఆధ్వర్యంలో మంగళవారం టీకా వేసుకోని వారిని గుర్తించి వారు ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్లి వ్యాక్సిన్ వేశారు. గ్రామీణ ప్రాంతాల్లో రైతులు వ్యవసాయ పనుల్లో ఉండడంతో అక్కడికి వెళ్లి రైతులు, రైతు కూలీలకు టీకా వేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో డాక్టర్ మహేశ్వరి, ఆశకార్యకర్తలు, వైద్య బృందం తదితరులు పాల్గొన్నారు.
ప్రతిఒక్కరూ టీకా వేసుకోవాలి
ప్రతిఒక్కరూ వ్యాక్సిన్ వేసుకోవాలని జెడ్పీ వైస్‌చైర్మన్ యాదయ్య పేర్కొన్నారు. మండలంలోని కోడ్గల్‌లో మంగళవారం జెడ్పీ వైస్‌చైర్మన్ వ్యాక్సినేషన్‌ను పరిశీలించి మాట్లాడారు. ఫస్ట్ డోస్ వేసుకున్న వారు సెకండ్ డోస్ వేసుకోవాలని సూచించారు. వైద్య సిబ్బంది అవగాహన కల్పించాలని కోరారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు నవీన్‌రెడ్డి, ఇంతియాజ్, అంజయ్య, వెంకటయ్య, బా ల్రాజ్, గ్రామ కార్యదర్శి రవీందర్, అంగన్వాడీ, ఆశవర్కర్లు జయమ్మ, పారిజాత, ప్రమీల పాల్గొన్నారు.