దేవరకద్ర, డిసెంబర్ 31 : అయ్యప్పస్వామిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలని దేవరకద్ర పట్టణ అయ్యప్ప సేవాసమితి సభ్యులు డిమాండ్ చేశారు. మండలకేంద్రంలో శనివారం అంతరాష్ట్ర రహదారిపై బైఠాయించి ధర్నా నిర్వహించారు. ఈ సం దర్భంగా మాట్లాడుతూ హిందూ దేవతలతోపాటు అయ్యప్పస్వామిని అవమానించేలా మాట్లాడిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం ఎస్సై భగవంత్రెడ్డికి ఫిర్యాదు చేశారు.
మహ్మదాబాద్ మండలంలో..
హిందూ దేవుళ్లపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ శనివారం మండలకేంద్రంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా హిందూవాహిని, అఖిలభారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి సభ్యులు మాట్లాడుతూ హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా వ్యాఖ్య లు చేసిన వారిపై పీడీ యాక్టు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.
గండీడ్ మండలంలో..
గండీడ్ మండలంలోని వెన్నాచేడ్ లో హిందూవాహిని ఆధ్వర్యంలో బైరి నరేశ్ దిష్టిబొమ్మను దహనం చేశారు. హిందూ దేవతలను అవమానపర్చేలా మాట్లాడిన అతడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
భూత్పూర్ మండలంలో..
అయ్యప్పస్వామిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బైరి నరేశ్‌ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ శనివారం భూత్పూర్ చౌరస్తాలో అయ్యప్ప సేవా సమాజం ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించా రు. ఈ సందర్బంగా అయ్యప్ప సేవా సమాజం అధ్యక్షుడు కరుణాకర్‌రెడ్డి మాట్లాడుతూ హిందూ దేవుళ్లపై కొంద రు పనిగట్టుకొని అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. అలాంటి వారిని బహిరంగంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అనంతరం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కార్యక్రమంలో శంక ర్, వెంకటేశ్వర్రావు, వెంకటస్వామి, రాజేశ్ తదితరులు పాల్గొన్నారు.
పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు
హిందు దేవతలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని శనివారం అయ్యప్ప సేవాసమితి ఆధ్వర్యంలో స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యా దు చేశారు. కార్యక్రమంలో రామకృష్ణాగౌడ్, నర్సింహులు, వెంకటయ్యగౌడ్, విజయ్‌కుమార్ పాల్గొన్నారు.
బాలానగర్ మండలంలో..
హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా వ్యా ఖ్యలు చేసిన వారిపై చట్టపరమైన చర్య లు తీసుకోవాలని అయ్యప్పస్వాములు శనివారం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యా దు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడు తూ హిందూ దేవతలు, అ య్యప్పస్వామిని కించపరిచేలా అనుచిత వ్యాఖ్య లు చేసిన వారిపై పీడీ యాక్టు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో అయ్యప్పస్వాములు ఉన్నారు.