పాలమూరు : మహబూబ్‌గర్ జిల్లా కేంద్రంలోని రవీంద్ర నగర్ శీతలాదేవి ( Shitala Devi Bonalu ) ఆలయం 36వ వార్షిక ఉత్సవాలు గురువారం నుంచి ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా అమ్మవారికి సుప్రభాతసేవ ( Suprabata Seva) , అభిషేకం, గణపతి పూజ, కుంకుమార్చన, లలిత సహస్ర నామ పారాయణం నిర్వహించారు.
ఈనెల 11వ తేదీన నూతన భవన ప్రారంభోత్సవం,హోమం, ఆర్వో వాటర్ ప్లాంట్ ప్రారంభోత్సవం,అన్నదాన కార్యక్రమం,15న అమ్మవారికి బోనాల నైవేద్య సమర్పణ వంటి కార్యక్రమాలు నిర్వహించనునట్టు ఆలయ కమిటీ అధ్యక్షుడు శ్రావణ్ కుమార్ తెలిపారు. ఈ ఉత్సవాలలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందాలని కోరారు.