అలంపూర్, అక్టోబర్ 6 : శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆదివారం జోగుళాంబ అమ్మవారు కూష్మాండదేవీగా దర్శనమిచ్చారు. నిత్యపూజల్లో భాగంగా హోమా లు, బలిహరణలు, కుంకుమార్చనలు చేశారు. సాయం త్రం దశవిధహారతులు సమర్పించారు. కూష్మాండదేవికి కొలువు పూజాకుమారి సువాసినీ పూజ, దర్బార్ సేవ నిర్వహించి నీరాజన మంత్ర పుష్పాలు సమర్పించారు.
ఈ మాతను పూజిస్తే చదువు, జ్ఞానం, ధైర్యం సిద్ధిస్తాయని భక్తుల నమ్మకం.సెలవురోజు కావడంతో అమ్మవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. భక్తులకు అత్యవసర చికిత్సలు అందించేందుకు కలెక్టర్ ఆదేశాల మేరకు క్యాతూరు పీహెచ్సీ సిబ్బంది హెల్త్ క్యాంప్ నిర్వహించారు. కార్యక్రమంలో హెల్త్ అసిస్టెంట్ బాలీశ్వరయ్యశెట్టి, ఏఎన్ఎంలు హైమావతి, ఫార్మసిస్ట్, ఆశ కార్యకర్తలు పద్మ, చిట్టెమ్మ తదితరులు పాల్గొన్నారు.
జోగుళాంబ ఆలయానికి ఐటీ శాఖ మంత్రి శ్రీధర్‌బా బు రాగా.. అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు స్వాగతం పలికారు. పుష్పగుచ్చాలు అందజేసి శాలువాతో సన్మానించారు. అనంతరం మంత్రితో కలిసి ఆలయాలను దర్శించుకున్నారు. మంత్రి కుటుంబసభ్యులు అమ్మవారి యాగశాలలో హోమం నిర్వహించారు. అలాగే ఎంపీ మల్లురవి కూడా పూజలు చేశారు. దర్శన అనంతరం అర్చకులు వేద ఆశీర్వచనం పలికారు. కార్యక్రమంలో ఈవో పురేందర్‌కుమార్, ఆలయ పాలకమండలి చైర్మన్ నాగేశ్వర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సంపత్‌కుమార్ పాల్గొన్నారు. అనంతరం తెలంగాణ టూరిజం హోటల్లో సంపత్‌కుమార్‌తో కలిసి కాం గ్రెస్ నాయకులు, కార్యకర్తలతో సమీక్ష నిర్వహించారు.
శ్రీశైలం, అక్టోబర్ 6 : శ్రీశైలంలో భ్రమరాంబాదేవి కుష్మాండ దుర్గాగా భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారు సాత్విక రూపంలో సింహవాహనాన్ని అధిష్టించి ఎనిమిది చేతుల్లో కుడివైపు పద్మం, బాణం, ధనస్సు, కమండలం, ఎడమవైపు చక్రం, గద, జపమాల, అమృతకళశాన్ని దాల్చినట్లు ఈవో పెద్దిరాజు తెలిపారు. సాయంత్రం భ్రమరాంబ, మల్లికార్జున స్వామివారు కైలాసవాహనంపై విహరిస్తూ భక్తులను కటాక్షించారు.
అక్కమహాదేవి అలంకారమండపంలో కుష్మాండ దుర్గా సమేతుడైన మల్లన్నకు విశేష అర్చనలు, హారతులు, షోడశపూజలు నిర్వహించారు. ఆదిదంపతులు కైలాస వాహనంపై గంగాధర మండపం నుంచి నంది మండపం, బయలు వీరభద్రస్వామి ఆలయం వరకు ఊరేగింపు నిర్వహించారు. గ్రామోత్సవాన్ని తిలకించేందుకు భక్తులు బారులుదీరారు. అనంతరం కాళరాత్రిపూజ మంత్రపుష్పంతోపాటు అమ్మవారికి ఆస్థానసేవ నిర్వహించినట్లు ఆలయ స్థానాచార్యులు పూర్ణానంద ఆరాధ్యులు తెలిపారు. కళారాధనలో తెలంగాణ, ఆంధ్ర రాష్ర్టాల నుంచి వచ్చిన కళాకారుల ఆటాపాటలు అలరించాయి.
పాలమూరు/ఆత్మకూరు, అక్టోబర్ 6 : శరన్నవరాత్రి వేడుకల్లో భాగంగా మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని బ్రాహ్మణవాడలోని వాసవి కన్యకాపరమేశ్వరీ ఆలయం లో ఆదివారం అమ్మవారు మహాలక్ష్మి అలంకరణలో దర్శనమిచ్చారు. కాగా, అమ్మవారిని రూ.6,66,66,666 అ లంకరించారు. నగదు ఎక్కువగా ఉండడంతో భారీ సె క్యూరిటీ కల్పించారు. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. అలాగే ఆత్మకూరు కన్య కాపరమేశ్వరి ఆలయంలో అమ్మవారిని రూ.2.90 కోట్ల తో ధనలక్ష్మి అవతారంలో దర్శనమిచ్చారు. సా యంత్రం ఆలయంలో మహిళలు బతుకమ్మ ఆడారు. అలాగే స్వర్ణకార సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మండపాల్లో మహిళలు బతుకమ్మ వేడుకలు నిర్వహించారు. కార్య క్రమాల్లో మహిళలు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.